Manchu Manoj : మోహన్ బాబు రెండవ కుమారుడు మంచు మనోజ్ రెండవ పెళ్లి , దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె భూమా మౌనికా రెడ్డి తో నిన్న హైదరాబాద్ లోని మంచు లక్ష్మి ప్రసన్న స్వగృహంలో బంధు మిత్రులు మరియు కుటుంబ సభ్యుల మధ్య చాలా సాధారణంగా జరిగింది.గత కొంతకాలం నుండి ప్రేమలో మునిగితేలుతున్న ఈ ప్రేమ జంట,కొంతకాలం నుండి ఒకే ఇంట్లో ఉంటున్నారు.
వీళ్ళ పెళ్లి గురించి సోషల్ మీడియా చాలా కాలం నుండి కథనాలు ప్రచారం అవుతూనే ఉన్నాయి కానీ, అవన్నీ రూమర్స్ అని అనుకున్నారు అందరూ.కానీ అదంతా నిజమేనని నిన్న వీళ్ళ పెళ్లి ద్వారా అందరికీ చెప్పకనే చెప్పారు . ఈ పెళ్ళికి టాలీవుడ్ నుండి తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సునీల్ తదితరులు మాత్రమే హాజరయ్యారు.తనకి మొదటి నుండి ఎంతో క్లోజ్ గా ఉన్న వాళ్లనే ఈ పెళ్ళికి ఆహ్వానించాడు మనోజ్.
ఇది ఇలా ఉండగా ఈ పెళ్ళికి మనోజ్ సోదరుడు మంచు విష్ణు అన్నయ్య లాగ కాకుండా, కేవలం ఒక అతిథిగా మాత్రమే హాజరై, అక్షింతలు వేసి 20 నిమిషాలలోపే తిరిగి వెళ్ళిపోయాడు.ఇదే ఈ పెళ్ళిలో హాట్ టాపిక్ గా మారిన అంశం. ఒకే ఇంట్లో పుట్టి పెరిగిన వీళ్లిద్దరి మధ్య గత కొంతకాలం నుండి విబేధాలు ఏర్పడ్డాయని, ఆ విభేదాల కారణంగానే మనోజ్ విడిపోయి వేరే ఇంట్లో సపరేట్ గా ఉంటున్నాడని ఫిల్మ్ నగర్ లో రకరకాల వార్తలు జోరుగా ప్రచారం సాగాయి.
ఇప్పుడు మనోజ్ పెళ్ళిలో విష్ణు వ్యవహరించిన తీరు చూస్తుంటే ఆ వార్తలన్నీ నిజమేనేమో అనిపిస్తుంది. అంతే కాదు , మోహన్ బాబు కూడా ఈ పెళ్ళికి రావడం లేదని గత కొద్దీ రోజులుగా రూమర్స్ వచ్చాయి. కానీ వాటిల్లో ఎలాంటి నిజం లేదని, రెండు రోజుల నుండి మోహన్ బాబు లక్ష్మి ప్రసన్న ఇంట్లో పెళ్ళికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నాడని మంచు కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక మంచు మనోజ్ పెళ్ళికి సంబంధించిన కొన్ని ఎక్సక్లూసివ్ ఫోటోలను మీకోసం అందిస్తున్నాము చూడండి.