Manchu Lakshmi : మంచు కుటుంబానికి చెందినవాళ్లు ఈమధ్య ఏమి చేసిన సోషల్ మీడియా లో కామెడీ అయిపోతుంది. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలలో కామెడీ చేసారంటే అందులో ఒక అర్థం ఉంది, ఎందుకంటే అప్పట్లో మంచు విష్ణు చేసే కామెంట్స్ అంత కామెడీ గా జనాలకు నిజంగానే అనిపించింది కాబట్టి, కానీ ప్రతీ చిన్న విషయాన్ని కామెడీ చెయ్యాలనుకుంటే మాత్రం చూసే దానికి చాలా అసహ్యం గా ఉంటుంది.

రీసెంట్ గా మంచి లక్ష్మి విషయం లో అదే జరిగింది. అసలు విషయానికి వస్తే రీసెంట్ గా ఆమె ప్రముఖ హీరో సుమంత్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఒక ఫోటో పెట్టింది. ఆ ఫొటోలో సుమంత్ ని ఆమె కౌగలించుకోవడమే ఇప్పుడు వచ్చిన అసలు సమస్య, వాళ్లిద్దరూ కౌగిలించుకున్న విధానం స్నేహితులు లాగా లేదని, లవర్స్ లాగ కౌగలించుకున్నారంటూ సొంతమంది నెటిజెన్స్ దిగజారి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
ఒక అమ్మాయి అబ్బాయి కౌగలించుకుంటే ప్రతీ ఒక్కరు వక్ర దృష్టితోనే చూస్తారా.. అసలు వీళ్ళు ఏమి మనుషులు అని ఆ కామెంట్స్ చూస్తే అనిపిస్తూ ఉంటుంది.. ఒక్కోసారి ఇలాంటి మనుషులు ఉన్న ఈ సమాజం లో మనం బ్రతుకుతున్నామా అని అనిపిస్తాది. మంచు లక్ష్మి పెళ్ళైన అమ్మాయి, ఆమెకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. అలాంటి మనిషి మీద చేతిలో మొబైల్ ఉంది కదా అని ఏది పడితే అలా మాట్లాడేస్తారా.

మంచు లక్ష్మి స్థానం వీళ్ళ అక్కలు ఉంటే ఇలాగే ఆలోచిస్తారా అని మంచు ఫ్యామిలీ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. హైదరాబాద్ కల్చర్ లో ఒక అమ్మాయి అబ్బాయి కౌగిలించుకోవడం, కిస్ చేసుకోవడం అనేది సర్వసాధారణం, దానికి వాళ్ళు లవర్స్ అవ్వాల్సిన అవసరం లేదు, మొగుడు పిల్లలు అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. మారుతున్న నాగరికతకు దగ్గరగా ప్రతీ ఒక్కరు మారాలి, ఇలా సోషల్ మీడియా లో ఏది పడితే అది మాట్లాడేస్తే భవిష్యత్తులో లీగల్ గా కూడా సమస్యలు ఎదురుకోవాల్సి వస్తుందని మంచు అభిమానులు సోషల్ మీడియా లో వార్నింగ్ ఇస్తున్నారు.