Manchu Lakshmi : అలా చేస్తే.. తెలుగు అమ్మాయిలు కూడా స్టార్ హీరోయిన్స్ అవుతారు.. మంచులక్ష్మి సలహాలు

- Advertisement -

సినీ నటి, మోహన్ బాబు కూతురు Manchu Lakshmi కీలక విషయం బయట పెట్టింది. తాను టాలీవుడ్ రాక ముందు హాలీవుడ్ సినిమాలకు పని చేసినట్లు తెలిపింది. హాలీవుడ్ లో ఉంటే ఇప్పటికే గొప్పగా ఎదగేదాన్ని అని అన్నారు. టాలీవుడ్ కు ఎందుకు వచ్చానో అని అప్పుడప్పుడు అనిపిస్తుందని చెప్పారు. మళ్లీ హాలీవుడ్ కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. తెలుగు ప్రేక్షకులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లనే ఇష్టపడతారని.. స్వరాష్ట్రం వారిని మాత్రం ఇష్టపడరని ఆవేదన వ్యక్తం చేసింది.

Manchu Lakshmi
Manchu Lakshmi

ఈ మేరకు మంచు లక్ష్మి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను తెలుగు ఇండస్ట్రీకి రాకముందు కొన్ని హాలీవుడ్ సినిమాలకు పనిచేసినట్లు చెప్పింది. అక్కడే ఉండుంటే ఈ పదేళ్లలో తాను ఎక్కడో ఉండేదాన్ని అని, అప్పుడప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో అని అనిపిస్తుంది అని పేర్కొంది. ఆ దేవుడు మళ్ళీ అవకాశం కల్పిస్తే మళ్ళీ హాలీవుడ్ కి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితి చాలా విచిత్రంగా ఉందని, ఇక్కడి తెలుగు ప్రేక్షకులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లనే ఇష్టపడతారు.. కానీ వాళ్ళ సొంత రాష్ట్రాలకు చెందిన హీరోయిన్లను మాత్రం ఆదరించరని మంచు లక్ష్మి చెప్పింది. ప్రేక్షకులు ఇక్కడి వాళ్లను ఒక్క శాతం ప్రేమించినా, వాళ్ళు ఎక్కడో ఉంటారని తెలిపింది.

మంచులక్ష్మి
మంచులక్ష్మి

ఇక్కడే పుట్టిన నిహారిక ఎందుకు సినిమాలు చేయడం లేదు? టాప్ హీరోయిన్లతో పాటు ఆమెకు సినిమా అవకాశాలే రావడం లేదు. తెలుగు అమ్మాయి బిందు మాధవి ఎందుకు సినిమాలు చేయట్లేదు? మధుశాలినీతోపాటు శివాని, శివాత్మిక.. వీళ్లంతా తెలుగులో ఎందుకు సినిమాలు చేయట్లేదు? అంటూ మంచు లక్ష్మి ప్రశ్నించింది. వీళ్లంతా దేనిలో తక్కువ? అందంతో పాటు టాలెంట్ ఉన్న వాళ్లే కదా! అంటూ ఒకింత ఫైర్ అయింది. ఇక్కడి ప్రేక్షకులకే కాదు మూవీ మేకర్స్ కి కూడా ముంబై, తమిళ్, పంజాబీ, కేరళ, కన్నడ వంటి రాష్ట్రాలకు చెందిన హీరోయిన్లే కావాలి. కానీ తెలుగు వాళ్ళను మాత్రం అస్సలు వద్దంటారు” అంటూ మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here