Guntur Kaaram : ఎంత మహేశ్ అయితే మాత్రం.. ఇదెక్కడి ప్రమోషన్స్ రా బాబు.. ఆఖరికి ఈ ప్యాకెట్స్ ను కూడా వదల్లేదుగా..

- Advertisement -


Guntur Kaaram : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా మాస్ అండ్ యాక్షన్ చిత్రం “గుంటూరు కారం”. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలే ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రంలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Guntur Kaaram
Guntur Kaaram

ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం వరుస ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. సాధారణంగా ప్రస్తుత కాలంలో తమ అభిమాన హీరోల సినిమాలను ప్రమోట్ చేసేందుకు చాలా మంది రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు.

Guntur Kaaram Memes

ఈ క్రమంలో తమ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు చాలా మంది సెలబ్రిటీలతో పలు యాడ్స్ లో మాట్లాడటం లాంటివి కూడా చేస్తున్నారు ఈ మూవీ చిత్ర బృందం. గుంటూరు కారం సినిమా ప్రమోషన్ ఎలా జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు. మహేష్ గుంటూరు కారం సినిమా పోస్టర్ ను లేస్ ప్యాకెట్ పై ప్రింట్ చేసి విక్రయిస్తున్నారు. ఓ యువకుడు ఈ ప్యాకెట్‌ను కొనుగోలు చేసి వీడియో తీసి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here