Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని రాజమౌళితో చేస్తున్న సంగతి తెలిసిందే.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ వరల్డ్ డైరెక్టర్ గా దర్శకుదురుడు రాజమౌళి మారిపోయారు దాంతో ఆయన సినిమాకు సంబంధించిన ఏ చిన్న లీక్ వచ్చినా అది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతుంది. రాజమౌళి మహేష్ కాంబినేషన్లో రానున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి వివిధ భాగాల కోసం వర్క్ షాప్ లను ఆరు నెలల నుంచి చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. మహేష్ రాజమౌళి తీనున్న సినిమాని మూడు భాగాలుగా తీయాలని చూస్తున్నారని.. ఈ సినిమాతో ఇంటర్నేషనల్ మార్కెట్ ని కైవసం చేసుకోవాలని రాజమౌళి భావిస్తున్నాడని టాక్ గట్టిగా వినిపిస్తోంది. అంతేకాకుండా మహేష్ ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ వినిపించడంతో మహేష్ అభిమానులు వైరల్ చేస్తున్నారు ఈ ట్రయాలజీ ప్లాన్ కనుక నిజం అయితే మాత్రం మహేష్ బాబు అభిమానులకు పూనకాలు లోడింగ్ అనడంలో సందేహం లేదు.

మహేష్ తో రాజమౌళి తీయబోయే సినిమాలో దిగ్గజ నటులు కమల్ హాసన్, చియాన్ విక్రమ్ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. మళయాళ నటుడు పృధ్విరాజ్ సుకుమారన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం. ప్రస్తుతం ఆ నటులతో రాజమౌళి టీం జరిపినట్లు సమాచారం. మహేష్ బాబు తో తీయబోయే చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ లో నిర్మించేందుకు రాజమౌళి కసరత్తులు చేస్తున్నారు. సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా తీసుకురాబోతున్నట్లు సమాచారం.