Mahesh Babu : సినిమా హిట్టా? ఫ్లాపా? అనే టాక్ తో సంబంధం లేకుండా స్టడీగా రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించడమనేది ప్రిన్స్ కు సర్వసాధారణమైపోయింది. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమాతో గ్లోబల్ హీరోగా మారనున్నారు. చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించుకుంటూ నిజజీవితంలో నిజమైన హీరోగా నిలిచిన మహేష్ బాబు రెమ్యునరేషన్ భారీగా ఉంటుంది. ప్రస్తుతం ఆయన సంపాదన ఎలా ఉంది? ఆస్తి వివరాలు తెలుసుకుందాం.

మహేష్ బాబు ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ పేరుతో సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కలిగి ఉండటమే కాకుండా హైదరాబాద్ గచ్చిబౌలిలో సెవెన్ స్క్రీన్ మల్టీప్లెక్స్ ఏఎంబి సినిమాస్ కలిగివున్నారు. ఏపీ, తెలంగాణలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. రెయిన్ బో ఆసుపత్రులకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఒక్కో వాణిజ్య ప్రకటనలో నటించేందుకు రూ.10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట.

ఇప్పటివరకు మహేష్ బాబు 50 వాణిజ్య ప్రకటనల్లో నటించారు. అలాగే సినిమాకు రూ.80 నుంచి రూ.100 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. రియల్ ఎస్టేట్ తోపాటు ఆసుపత్రుల్లో తన ఆదాయాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు. హైదరాబాద్ లో రూ.40 కోట్ల విలువచేసే ఇల్లు ఉందట. వీటితో పాటు రెండు చోట్ల బంగ్లాలు కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ప్రిన్స్ ఆస్తులన్నీ కలిపితే రూ.13 వేల కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.