Mahesh Babu: తండ్రి కోరిక తీర్చలేకపోయిన మహేష్.. ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాడు

- Advertisement -

Mahesh Babu: మహేశ్ బాబు గురించి తెలియని వారు దాదాపు ఉండరు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి చైల్డ్ ఆర్టిస్టుగా వచ్చి ఇండస్ట్రీని ఏలుతున్నారు. నట శేఖర కృష్ణకు తనయుడిగా తండ్రి కంటే గొప్ప స్థాయికి చేరుకున్నారు. ఏ తండ్రికైనా కొడుకు ఉన్నత స్థాయిలో ఉంటే ఆ తండ్రికి అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. అలాగే కృష్ణ కూడా తన సంతానాన్ని ఉన్నత స్థాయిలో ఉంచగలిగారు. నిజానికి సూపర్ స్టార్ కృష్ణ కి ఐదుగురు సంతానం. వారిలో పెద్దవాడు రమేష్ బాబు.

Mahesh Babu
Mahesh Babu

తాను కృష్ణ గారి కంటే ముందే కాలం చేశారు. అలాగే తనకు ఇంకా ముగ్గురు కూతుర్లు .. కొడుకు మహేష్ బాబు ఉన్నారు. రమేష్ బాబును స్టార్ హీరోని చేయాలని కృష్ణ చాలా ప్రయత్నించారు కానీ కుదరలేదు. ఈ క్రమంలో తన తండ్రి ఆలోచనను సూపర్ స్టార్ మహేశ్ ఆచరణలో పెట్టి స్టార్ హీరో అయ్యారు. చిన్నప్పటి నుంచి మహేష్ బాబు కి సంబంధించిన అన్ని విషయాలు దివంగత నటుడు కృష్ణ అనుకున్నది అనుకున్నట్లు జరిగాయట. కానీ ఒక్క పెళ్లి విషయంలోనే కృష్ణ నిరుత్సాహ పడ్డారట. కృష్ణ కోరికను మహేశ్ నెరవేర్చలేకపోయారట. కారణం ఏంటంటే మహేశ్ బాబు నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నిజానికి ఆ టైంలో కృష్ణ వీరి పెళ్లికి అసలు ఒప్పుకోలేదని టాక్. అందుకు వారిద్దరు కృష్ణ అంగీకారం కోసం ఐదేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చిందట.

వాస్తవానికి కృష్ణ తనకి ఇంటి కోడలుగా ఓ తెలుగు అమ్మాయిని తెచ్చుకోవాలని ఆశ పడ్డారట. నార్త్ అమ్మాయిని తన ఇంటి కోడలుగా తెచ్చుకునేందుకు ససేమీరా అన్నారట. కానీ అప్పటికే నమ్రత బాలీవుడ్ హీరోయిన్. అందుకే కృష్ణ మొదట్లో వద్దని చెప్పారట. వస్తే గిస్తే నా ఇంటికి అచ్చమైన తెలుగింటి అమ్మాయిని తెచ్చుకోవాలని ఆశపడుతున్నాను అని అన్నారట. కానీ మహేష్ బాబు మాత్రం నమ్రత తో అప్పటికే పీకళ్లోతు ప్రేమలో మునిగి పోవడంతో తల్లి ఇందిరాదేవి వారి ప్రేమను అర్థం చేసుకుని భర్తకు నచ్చజెప్పి కొడుకు పెళ్లి దగ్గరుండి జరిపించిందట. అలా పెళ్లి విషయంలో మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కోరికను తీర్చలేకపోయారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లయిన తర్వాత నమ్రత పద్ధతి చూసి కృష్ణ కోడలిగా వచ్చినందుకు సంతోషపడ్డారట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here