Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక డైరెక్టర్ ని కానీ , మ్యూజిక్ డైరెక్టర్ ని కానీ నమ్మితే చాలా గట్టిగా నమ్ముతాడు. ఎన్నో సందర్భాలలో ఆయన కనీసం స్టోరీ కూడా వినకుండా షూటింగ్స్ లో పాల్గొన్నాడు కూడా. కొంత మంది దర్శకులు ఆయన పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు కానీ, మరికొంత మంది దర్శకులు మాత్రం నిలబెట్టుకోలేకపోయారు. డైరెక్టర్స్ వల్ల మహేష్ బాబు ఇప్పటి వరకు నష్టపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

కానీ సంగీత దర్శకుల వల్ల మాత్రం ఇన్నేళ్ల కెరీర్ లో మొట్టమొదటి సారి ఇబ్బందులను నష్టాలను ఎదురుకుంటున్నాడు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ మరెవరో కాదు, థమన్..ఈయన గతం లో మహేష్ బాబు కి ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు. ముఖ్యంగా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన దూకుడు చిత్రం అప్పట్లో ఒక సెన్సేషన్. పాటలతో పాటుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని కూడా అభిమానులు చిరకాలం గుర్తు పెట్టుకునే రేంజ్ లో ఇచ్చాడు.

కానీ ఇప్పుడు మాత్రం మహేష్ బాబు కి ఆశించిన స్థాయి ఆల్బమ్స్ ని ఇవ్వలేకపొతున్నాడు. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రం ‘సర్కారు వారి పాట’ కి చాలా యావరేజ్ ఆల్బం ఇచ్చాడు. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అభిమానులు ఊహించిన స్థాయి లో ఇవ్వలేదు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా మహేష్ బాబు కి ఎలాంటి సమస్యలు రాలేదు థమన్ వల్ల రాలేదు కానీ, సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ విషయం లో మాత్రం మహేష్ బాబు కి చాలా ఇబ్బందులు ఎదురు అయ్యాయి.

అనుకున్న సమయానికి ట్యూన్స్ ఇవ్వకపోవడం వల్ల షెడ్యూల్స్ చాలా ఆలస్యంగా మొదలయ్యాయి. ఒక్కటంటే ఒక్క పాట కూడా థమన్ కరెక్ట్ సమయానికి ఇవ్వలేకపోయాడు. దీనిపై మహేష్ బాబు చాలా ఫైర్ మీద ఉన్నాడట. ఇక మీదట థమన్ తో కలిసి పని చేసే ప్రసక్తే లేదని చాలా బలంగా చెప్పేశాడట త్రివిక్రమ్ తో. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.