కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు మహేశ్ బాబు. మగువల పాలిట మన్మథుడిగా పేర్గాంచారు. పెళ్లి కాని ఆడపిల్లలు ఎవరైనా మహేశ్ లాంటి భర్తే రావాలని కోరుకుంటారంటే ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంటో అర్థమైపోతుంది. మహేష్ బాబు సినిమాల్లోనే కాకుండా పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అటు యాడ్స్ లో ఇటు బిజినెస్ లో కూడా మహేశ్ రానిస్తున్నారు. దీంతో మహేశ్ సంపాదన ఏడాదికి కొన్ని వందల కోట్లు ఉంటుంది. మహేష్ బాబుకు ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజీలో ఇప్పటికే చాలా కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా మహేశ్ ఓ లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. ఇప్పటి వరకు తన కారు కలెక్షన్లో ఈ మోడల్ లేదు.

ఆయన తాజాగా రేంజ్ రోవర్ కారు కొన్నట్లు తెలుస్తోంది. గోల్డెన్ కలర్ రేంజ్ రోవర్ ప్రస్తుతం తన గ్యారేజీలో చేరింది. ఇప్పుడు ఈ కారు ధర గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. దీని ధర సుమారుగా రూ. 5.4 కోట్ల రూపాయలు. కళ్లు చెదిరే లుక్ తో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ కారు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్, చిరంజీవి, మోహన్ లాల్, సల్మాన్ ఖాన్ తదితర హీరోల వద్ద కూడా రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయి.

రేంజ్ రోవర్ ఎస్వీ సూపర్ ఇప్పుడు హైదరాబాద్‌లో సరికొత్త మోడల్‌గా రావడంతో మహేష్ బాబు ఈ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. మహేశ్ ఒక్కో సినిమాకు రూ.80 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అంతే కాకుండా రకరకాల యాడ్స్ ద్వారా కమర్షియల్స్ ద్వారా భారీ మొత్తంలో వసూళ్లు సాధిస్తున్నారు.