కంగారులో అసలు ఏజ్ చెప్పేసిన జబర్దస్త్ నరేష్..

- Advertisement -

జబర్దస్త్ కామెడీ షో చూసే వాళ్లకు జబర్ధస్త్ నరేష్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. చూడ్డానికి మూడడుగులు కూడా ఉండడు.. కానీ పంచులు పేలిస్తే మాత్రం పొట్ట చెక్కలు కావాల్సిందే. అంతగా జ‌బ‌ర్ద‌స్త్ షోలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతున్న కుర్ర కమెడియన్ నరేష్ ఉరఫ్ నాటి నరేష్. ఈయన అసలు వయసు ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. చూడ్డానికి మిర‌ప‌కాయ్‌లా ఉన్నా కూడా ఆయ‌న కామెడీ మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. తాజాగా ఈ బుడ్డోడి అసలు వయసు చెప్పేసింది అప్పట్లో జడ్జిగా ఉన్న రోజా. దాంతో నరేష్ వయసు సీక్రేట్ బయటపడిపోయింది.

జబర్దస్త్ నరేష్
జబర్దస్త్ నరేష్

తనదైన పంచులతో పిచ్చెక్కిస్తుంటాడు ఈ కుర్రాడు. మూడడుగులే ఉంటాడు కానీ ఆరడుగుల మిగిలిన టీం లీడర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తుంటాడు తన టైమింగ్‌తో. అలాంటి నాటి నరేష్ వయసు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. మనోడి వయసెంత అనేది చాలా మందికి తెలియదు. చూడ్డానికి జూనియర్‌లా ఉంటాడు.. కానీ ఓటు హక్కు కూడా వచ్చేసింది. అంత సీనియర్ ఈ చిట్టి మిరపకాయ్. వరంగల్ జిల్లా జనగాం దగ్గర్లోని అనంతపురం అనే ఊళ్లో పుట్టిన నరేష్.. చిన్నప్పటి నుంచే ఎదుగుదల లోపంతో బాధ పడుతున్నాడు.

అదే అతడికి వరమైంది కూడా. పదేళ్ల పిల్లాడిలా కనిపిస్తుంటాడు కానీ నరేష్ వయసు మాత్రం 24 ఏళ్లు అంటే నమ్మడం కాస్త కష్టమే. 1999 సంవత్సరంలో పుట్టిన నరేష్.. ఢీ షో జూనియర్స్‌కు వచ్చాడు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌ బయటే తిరుగుతుంటే సునామీ సుధాకర్ చూసి చంటి టీంలో జాయిన్ చేసాడు. నరేష్ వయసు గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు ఏ షోలో కూడా తన వయసు గురించి ఓపెన్ కాలేదు నరేష్. అయితే తొలిసారి జబర్దస్త్‌లోనే నోరు జారాడు ఈ బుడ్డోడు. ఆ మధ్య ఓ స్కిట్‌లో భాగంగా తన వయసు 24 అంటూ ఒప్పేసుకున్నాడు. హైపర్ ఆది స్కిట్ చేస్తున్నపుడు 12 ఏళ్ళుగా జిమ్ చేస్తున్నా అంటూ అసలు వయసు చెప్పేసాడు నరేష్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here