Mahesh Babu : మహేష్ బాబు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..సినిమాలకు బ్రేక్..

- Advertisement -

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు Mahesh Babu సినిమాలకు బ్రేక్ తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తండ్రి చనిపోయిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే మళ్లీ వర్క్పై ఫోకస్ చేస్తున్న మహేష్.. ఇటీవలే ముంబైలో ఓ కమర్షియల్ యాడ్ షూటింగ్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్తో తను చేస్తున్న సినిమా గురించిన అప్డేట్ కూడా ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. నిజానికి మహేష్ Mahesh Babu ఈ మూవీ షూటింగ్లో డిసెంబర్ 8 నుంచి పాల్గొనాల్సి ఉన్నా ప్రస్తుతం వాయిదా వేసినట్లు తెలుస్తోంది…

ఇది మహేష్ బాబు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి..డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా #SSMB28 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిన్న షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్లో డిసెంబర్ 8 నుంచి పాల్గొనేందుకు మహేష్ ముందుగా ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణం తర్వాత కొద్ది రోజులు ఇంటికే పరిమితమైన ప్రిన్స్.. ప్రస్తుతం ఈ షెడ్యూల్ వాయిదా వేసినట్లుగా సమాచారం. సంక్రాంతి తర్వాత ప్లాన్ చేయాల్సిందిగా డైరెక్టర్ త్రివిక్రమ్ను కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంక్రాంతి తర్వాత ఎలాంటి బ్రేక్స్ లేకుండా 45 రోజుల పాటు షెడ్యూల్ కంటిన్యూ చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది..

- Advertisement -
Mahesh babu
Mahesh Babu

కాగా, ఈ గ్యాప్ ను ఫిల్ చెయ్యడానికి మహేష్, త్రివిక్రమ్తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దుబాయ్ వెళ్లనున్నారు. ఇక్కడే వారం రోజులు ఉండి, మ్యూజిక్ కంపోజిషన్ పూర్తిచేసేందుకు ఈ ముగ్గురు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి తమన్ ఇప్పటికే కొన్ని ట్యూన్స్ సిద్ధం చేసినా ఈసారి మహేష్ మ్యూజిక్ విషయంలో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాడని.. వీళ్లతో తను కూడా కూర్చుని సాంగ్స్ ఫైనలైజ్ చేస్తాడనే టాక్ వినిపిస్తోంది. అలాగే, లిరిక్ రైటర్స్ రామజోగయ్య శాస్త్రి తదితరులు సైతం దుబాయ్ వెళ్లనున్నారు.

ఈ ట్రిప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత #SSMB28 షూట్ ప్రారంభిస్తారని టాక్. న్యూ ఇయర్, సంక్రాంతి హాలిడేస్ ముగించిన తర్వాత మాత్రమే సినిమా సెట్స్పైకి వెళ్లవచ్చని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. అలాగే, తన ఇంట్లో చోటుచేసుకున్న వరుస విషాద ఘటనల నుంచి మహేష్ కోలుకునేందుకు కూడా కాస్త సమయం కావాలని ప్రిన్స్ ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్పై చినబాబునిర్మిస్తున్నారు. జూన్లోపు గా మొత్తం షూటింగ్ పూర్తి చేయాలని త్రివిక్రమ్ని కోరుతున్నాడు మహేష్. ఈ చిత్రం 2023 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది.. ఈ సినిమా తర్వాత జక్కన్న తో మూవీ చేస్తున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com