తెలుగు తార ఈషా రెబ్బ Eesha Rebba అందంలో కానీ.. నటనలో గానీ స్టార్ హీరోయిన్‌కు తీసిపోదు. అయినా ఈ భామకు అవకాశాలు మాత్రం రావడం లేదు. అప్పుడప్పుడు అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లకు పచ్చజెండా ఊపుతోంది. పిట్ట కథలు, త్రీ రోజెస్ లాంటి వెబ్ సిరీస్‌లతో యువతకు బాగా కనెక్ట్ అయింది ఈషా.
ఇక సోషల్ మీడియాలో ఈషా రెబ్బ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఓ సారి చీరలో కనువిందు చేస్తే.. మరోసారి ట్రెండీ వేర్లో కనిపిస్తుంది. ఇంకోసారి కైపెక్కించే పోజులతో స్కిన్ షో చేస్తుంది. ఎన్ని రకాలుగా తన అందాన్ని చూపించినా ఈ భామకు మాత్రం అవకాశాలు తక్కువే.ఈషా తరచూ ఫొటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో ఆ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది.
తాజాగా బ్లాక్ శారీలో ఈషా షేర్ చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. బ్లాక్ శారీలో ఈషా చాలా అందంగా ఉంది. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు ఈషాపై మనసు పారేసుకుంటున్నారు.
ఎంతైనా అమ్మాయిలు చీరలో చాలా అందంగా ఉంటారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈషా చాలా ముద్దొస్తున్నావ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి ఈషా బ్లాక్ శారీలో ఫొటోలు పోస్టు చేసి సోషల్ మీడియాలో సోకుల విందు వడ్డించింది.
తెలుగులో ఆఫర్లు రాకపోవడంతో ఈషా తన ఫోకస్ కోలీవుడ్‌పై పెట్టింది. ప్రస్తుతం రెండు తమిళ చిత్రాలు `అయిరామ్ జెన్మంగల్`, `ఒట్టు`అనే సినిమాలతో పాటు.. ఓ తెలుగు మూవీలో నటిస్తోంది ఈషా.