Jai Hanuman : రాముడిగా మహేష్ బాబు.. హనుమంతుడిగా రానా.. ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే వార్త!

- Advertisement -

Jai Hanuman : ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తారీఖున విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభ్జనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కొంతమంది స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానీ వంద కోట్ల రూపాయిల షేర్ ని కేవలం పది రోజుల్లో రాబట్టి చిత్ర సృష్టించిన ఈ సినిమా, ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తూ సత్తా చాటుతుంది.

సుమారుగా 15 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటి కి పైగా షేర్ వసూళ్లను సాధించిన అతి తక్కువ సినిమాలలో ఒకటి ‘హనుమాన్’. కేవలం #RRR చిత్రం కి ఒక్కటే 15 రోజులకు మించి కోటి కి పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఆ చిత్రం తర్వాత రీసెంట్ గా విడుదలైన ‘సలార్’ చిత్రానికి కూడా అంత రన్ రాలేదు. ఇక నేడు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రానికి మళ్ళీ అద్భుతమైన వసూళ్లు వచ్చాయి.

కేవలం ఈ ఒక్క రోజులోనే ఈ సినిమాకి నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ అనే చిత్రం కూడా ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అధికారికంగా చెప్పాడు. జనవరి 22 వ తారీఖున ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కూడా ప్రారంభించాడు. ఈ సినిమాలో ఒక పేరున్న స్టార్ హీరో నటిస్తాడని, ఆంజనేయ స్వామి ఇందులో హీరో అని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

అయితే లేటెస్ట్ వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈ చిత్రం లో ఆంజనేయ స్వామి గా దగ్గుపాటి రానా, శ్రీ రాముడిగా మహేష్ బాబు నటిస్తాడని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అధికారికంగా తెలియచెయ్యబోతున్నారట. రాజమౌళి తో సినిమా ప్రారంభించే ముందే, మహేష్ ఈ సినిమా పూర్తి చేస్తాడని టాక్. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here