Magadheera : చిత్రం రామ్ చరణ్ కెరియర్ లో ఎంత బిగ్గెస్ట్ హిట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ లవ్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ హీరోగా రామ్ చరణ్ కెరీర్ లో ఒక మైలు రాయి గా నిలిచింది. కాజల్ హీరోయిన్ గా చేసిన ఈ మూవీ లో నిజానికి హీరోయిన్ వేరే బ్యూటీ ఉండాల్సింది.2009లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టించింది.

ఈ చిత్రంలో రియల్ స్టార్ శ్రీహరి, శరత్ బాబు , దేవ్ గిల్, రావు రమేష్ ముఖ్యపాత్రలో నటించారు. 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో 80 కోట్ల రేంజ్ వసూళ్లు రాబట్టి కనివిని ఎరుగని రికార్డ్ సృష్టించింది. ఇక ఈ మూవీతో కాజల్ స్టార్ డమ్ బాగా పెరిగింది. ఇట్లాంటి సినిమాను వదులుకున్న హీరోయిన్ మరెవరో కాదు అనుష్క.

రాజమౌళి మొదట ఈ క్యారెక్టర్ కి అనుష్క అయితే బాగా సెట్ అవుతుందని భావించాడట. అంతకుముందు రాజమౌళి విక్రమార్కుడు మూవీలో అనుష్క నటించింది. మగధీరలో రాజకుమారి క్యారెక్టర్ కి అనుష్క పూర్తిగా న్యాయం చేస్తుంది అని భావించిన రాజమౌళి మొదట హీరోయిన్ గా అనుష్క ని అప్రోచ్ అయ్యాడు.

స్టోరీ నచ్చినప్పటికీ రామ్ చరణ్ తనకంటే పొట్టిగా ఉంటాడు కాబట్టి హైట్ డిఫరెన్స్ ఎక్కువ అని ఒకే ఒక కారణంతో అనుష్క ఈ మూవీకి నో చెప్పింది.ఇక ఈ క్యారెక్టర్ కి కాజల్ సెట్ అవుతుంది అని భావించిన రాజమౌళి మగధీర కు హీరోయిన్ గా కాజల్ ను తీసుకున్నాడు. అనుష్క ను చెప్తే చెప్పింది గాని.. కాజల్ కి మాత్రం అది బాగా అచ్చివచ్చింది.

223 కేంద్రాలలో 100 రోజుల పాటు .. అలాగే 299 కేంద్రాలలో 50 రోజుల పాటు ఈ మూవీ రికార్డ్ స్థాయిలో ఆడింది. మగధీర పుణ్యమా అని రెండవ సినిమాతోనే రామ్ చరణ్ స్టార్ హీరో స్టేటస్ అందుకుంటే కాజల్ టాలీవుడ్ కలల రాకుమారి అయ్యింది.