Bro the Avatar : 1500 షోలు..1 మిలియన్ డాలర్లు.. విడుదలకు ముందే చరిత్రలు తిరగరాస్తున్న ‘బ్రో ది అవతార్’

- Advertisement -

Bro the Avatar పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ ఈ నెల 28 వ తారీఖున గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేలా చేసింది. పాటలు అనుకున్నంత స్థాయిలో లేవు కానీ, టీజర్ మాత్రం అదిరిపోయింది.

Bro the Avatar
Bro the Avatar

ఇక రేపు విడుదల అవ్వబొయ్యే ట్రైలర్ బాగుంటే మాత్రం ఈ చిత్రానికి వసూళ్లు ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ఉంటాయి అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక పోతే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలలో ఇంకా ప్రారంభం కాలేదు కానీ, అమెరికా , ఆస్ట్రేలియా మరియు లండన్ వంటి ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి.ఒక్కసారి అక్కడ ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.

ప్రస్తుతం హాలీవుడ్ లో మూడు కొత్త సినిమాలు విడుదలయ్యాయి, మూడు కూడా భారీ అంచనాలు ఏర్పాటు చేసుకున్న సినిమాలే, ఇలాంటి సమయం లో ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో షోస్ దొరకకపోవచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా నిర్మాణ సంస్థ మాత్రం భారీ షోస్ ని ప్లాన్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 200 షోస్ ని ఓపెన్ చెయ్యగా, ఆ షోస్ నుండి దాదాపుగా 50 వేల డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి.

- Advertisement -

ఇంకా షోస్ ని యాడ్ చేస్తూ ఉన్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ చిత్రం కచ్చితంగా 7 లక్షల డాలర్స్ ని కొల్లగొడుతుందని అందరూ అనుకున్నారు. అదంతా పక్కన పెడితే ఈ సినిమాకి ఓవరాల్ గా 1500 షోస్ ని ప్లాన్ చేసాడట డిస్ట్రిబ్యూటర్. ఈ 1500 షోస్ నుండి 1 మిలియన్ డాలర్స్ ప్రీమియర్స్ కి ముందే కొట్టడం టార్గెట్ అట. మరి ఈ టార్గెట్ ని రీచ్ అవుతారా లేదా అనేది తెలియాలంటే ట్రైలర్ విడుదల అయ్యేవరకు ఆగాల్సిందే. బ్రో ది అవతార్

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here