Guess The Actor : ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. కానీ ఇప్పుడు దేశ రాజకీయాలను వణికిస్తుంది!

- Advertisement -

Guess The Actor : ఈ క్రింది ఫోటో లో అంత క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్న పాప ఎవరో గుర్తుపట్టారా?, ఈమె టాలీవుడ్ లో ఒకప్పుడు క్రేజీ స్టార్ హీరోయిన్, అప్పట్లో ప్రతీ హీరో ఈమె కాల్ షీట్స్ కోసమే ఎదురు చూసేవారు. పెద్దగా కలర్ లేకపోయినా కూడా, ఆకర్షణీయమైన ముఖం, అద్భుతమైన అభినయం తో పాటు డ్యాన్స్ లో కూడా స్టార్ హీరోలతో సమానంగా పోటీ పడే తత్త్వం ఈమె సొంతం. ఈమెని అందరూ ఫైర్ బ్రాండ్ అని పిలుస్తూ ఉంటారు.

Guess The Actor
Guess The Actor

సినిమాల్లో గొప్పగా రాణించిన ఈమె, రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టి విజయాలను చూసింది. ముందుగా తెలుగు దేశం పార్టీ లోకి అడుగుపెట్టి తన రెండుసార్లు ఎమ్యెల్యే గా పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత వైసీపీ పార్టీ తరుపున పోటీ చేసి రెండు సార్లు ఎమ్యెల్యే అయ్యింది. ఇక్కడే అర్థం అయిపోయి ఉండాలి ఆమె ఎవరో, ఆమె మరెవరో కాదు రోజా గారే.

ప్రస్తుతం ఈమె ఆంధ్ర ప్రదేశ్ టూరిజం మినిస్టర్ గా కూడా కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. తెలుగులో ‘ప్రేమ తపస్సు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రోజా, ఆ తర్వాత సర్పయాగం, సీతారత్నం గారి అబ్బాయి వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలన్నీ సక్సెస్ అవ్వడం ఆమెకి అవకాశాల వెల్లువ కురిసింది. కేవలం తెలుగు లో మాత్రమే కాదు, తమిళం లో కూడా ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

- Advertisement -

దాదాపుగా అందరి హీరోలతో కలిసి నటించిన రోజా , ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ లో కూడా మెరిసింది. ఇక బుల్లితెర మీద ఈమె ‘జబర్దస్త్’ కామెడీ షో కి న్యాయ నిర్ణేతగా పదేళ్ల పాటు కొనసాగింది. ఆ తర్వాత ఎన్నో షోస్ కి ఆమె వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించింది. ఎప్పుడూ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే రోజా, తన చిన్ననాటి ఫోటోని ఒకసారి షేర్ చేసింది. అది ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here