Sreeleela : టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో శ్రీలీల మొదటి స్థానం లో ఉంటుంది. పెళ్ళిసందడి అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా శ్రీలీల అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. ‘ధమాకా’ చిత్రం తో మొదలైన శ్రీలీల మేనియా కి టాలీవుడ్ దర్శక నిర్మాతలు మంత్రముగ్దులు అయిపోయారు.
ఈమె తమ సినిమాలో ఉంటే చాలు కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనే అభిప్రాయానికి వచ్చేసారు. ఎందుకంటే సినిమా టాక్ తో సంబంధం లేకుండా కేవలం శ్రీలీల డ్యాన్స్ చూసేందుకు కోసం థియేటర్స్ కి ఆడియన్స్ కదులుతున్నారు. అందుకే ఏకంగా 12 సినిమాల్లో నటించడానికి సంతకం చేసింది. అందులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి సూపర్ స్టార్స్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు శ్రీలీల కి బ్యాడ్ టైం ప్రారంభం అయిపోయింది అని అందరూ అంటున్నారు.
ఎందుకంటే ఆమె నుండి రీసెంట్ గా విడుదలైన సినిమాలలో కేవలం ‘భగవంత్ కేసరి’ మాత్రమే సూపర్ హిట్ గా నిల్చింది. స్కంద, ఆది కేశవ మరియు రీసెంట్ గా విడుదలైన ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్’ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. వీటిల్లో స్కంద చిత్రానికి కాంబినేషన్ క్రేజ్ ఉండడం వల్ల ఓపెనింగ్స్ బాగా వచ్చాయి కానీ, ఓవరాల్ థియేట్రికల్ రన్ ని చూసుకుంటే మాత్రం సుమారుగా 25 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది.
ఇక మిగిలిన రెండు సినిమాలకు కనీసం డబుల్ డిజిట్ క్లోసింగ్ వసూళ్లు కూడా వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. దానికి తోడు ఈమధ్య ఓటీటీ డీల్స్ కూడా జరగడం లేదు. దీంతో ఈ మూడు సినిమాలకు కలిపి దాదాపుగా వంద కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇలా మూడు నెలల్లో వంద కోట్ల రూపాయిల నష్టాలను తెచ్చిపెట్టిన ఏకైక హీరోయిన్ శ్రీలీల మాత్రమే అని అంటున్నారు.