కంటెంట్ ఉంటే కలెక్షన్స్ వస్తాయి బ్రో.. స్టార్ హీరోలను దాటి వంద కోట్ల క్లబ్ లో చేరిన యంగ్ హీరోలు వీళ్లే

- Advertisement -

ఒకప్పుడు టాలీవుడ్ లో హవా అంతా స్టార్ హీరోలది వాళ్లు ఫ్యామిలీ నటులది మాత్రమే. కానీ కాలం మారింది. ప్రేక్షకుల టేస్ట్ మారింది. కంటెంట్ ఉంటే చాలు.. హీరో, డైరెక్టర్ ఎవరో అవసరం లేదని భావిస్తూ భాషలకతీతంగా సినిమాలను ఆదరిస్తున్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడకుండా కథే అన్నింటికంటే గొప్ప అనే రీతిలో కంటెంట్ ఉన్న చిత్రాలకు పెద్దపీట వేస్తున్నారు.

ముఖ్యంగా కరోనా తర్వాత కంటెంట్ ఉన్న చిత్రాలకు ఆదరణతో పాటు కలెక్షన్లు కూడా బాగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చిన్న సినిమాలైనా.. తక్కువ బడ్జెట్ తో తీసిని చిత్రాలైనా కథ నచ్చితే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కోట్ల కొద్ది కాసులు కురిపిస్తున్నారు. అలా చాలా మంది చిన్న హీరోలు చిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి వారిని అలరించారు. తక్కువ బడ్జెట్ తో తీసినా.. కోట్ల కాసులు కురిపిస్తూ ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరారు.

- Advertisement -

ఓ సినిమా వంద కోట్ల కలెక్షన్లు సాధించడం ఈరోజుల్లో సాధారణం అయిపోయింది. అది కేవలం బడా హీరోలు, క్రేజ్ ఉన్న హీరోలకు మాత్రమే. అయితే ఇప్పుడు ఈ జాబితాలో యంగ్ హీరోలు కూడా చేరుతున్నారు. తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా దాన్ని మలిచి వారిని ఆకట్టుకుంటూ కలెక్షన్లు రాబట్టుకుంటున్నారు. అలా ఈ మధ్య వంద కోట్ల క్లబ్ లో చేరిన హీరోలు ఎవరు..? వాళ్లకు కాసులు కురిపించిన సినిమాలు ఏంటో తెలుసుకుందామా..?

  • సిద్ధు జొన్నలగడ్డ  రీసెంట్​గా సిద్ధు జొన్నలగడ్డ రూ.100 కోట్ల క్లబ్​లో చేరిపోయాడు. సిద్ధు లీడ్​ రోల్​లో నటించిన టిల్లు స్క్వేర్ సినిమా తాజాగా రూ.100 కోట్లు క్రాస్ చేసింది.
  • తేజ సజ్జ: యంగ్ హీరో తేజ సజ్జ- ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కిన హను-మాన్ మూవీ ఈ ఏడాదిలో వంద కోట్ల కాసులు కురిపించిన తొలి సినిమా. సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్​హిట్ కొట్టిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.330+ కోట్లు వసూల్ చేసింది.  తేజ తన మూడో సినిమాతోనే ఈ ఘనత అందుకున్నాడు.

  • నిఖిల్ సిద్ధార్థ్: యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్- అనుపమ పరమేశ్వరణ్ కాంబోలో 2022లో వచ్చిన కార్తికేయ-2 భారీ హిట్ సాధించింది. ఈ సినిమా బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టింది.  కార్తికేయకు సీక్వెల్​గా వచ్చిన ఈ సినిమా కూడా రూ.100 కోట్లకుపై వసూళ్లు చేసింది.
  • వైష్ణ‌వ్ తేజ్: మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ తన తొలి సినిమా ‘ఉప్పెన’తోనే వంద కోట్ల క్లబ్ లో చేరాడు. కరోనా తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా ఈ ఘనత సాధించడం విశేషం. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించినకు 2022 జాతీయ అవార్డు కూడా లభించింది.

  • విజ‌య్ దేవ‌ర‌కొండ: రౌడీబాయ్ విజయ్ దేవరకొండ తన ఆరో సినిమా ‘గీతా గోవిందం’తో రూ.100 కోట్ల క్లబ్​లో చేరాడు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్​గా నటించింది.
  • నాని: నేచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమాతో వంద కోట్ల క్లబ్​లో చేరాడు.
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com