Anchor Suma : యాంకర్ సుమ ఫన్నీ డ్యాన్స్ వీడియో వైరల్.. ఇదేం నాన్ సింక్ స్టెప్పులు రా బాబు అంటూ నెటిజన్ల కామెంట్స్

- Advertisement -

Anchor Suma : సుమ కనకాల.. టాలీవుడ్ లో ఈ పేరుకు ఓ క్రేజ్ ఉంది. పిల్లల నుంచి పెద్దల వరకు సుమకు ఫ్యాన్స్. పేరు మలయాళీ కానీ అచ్చ తెలుగు మహిళలా స్పష్టమైన తెలుగులో గలగలా మాట్లాడుతూ తెలుగు ఆడపడుచులా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. ఇక తెలుగబ్బాయి అయిన రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని తెలుగుంటి కోడలు అయిపోయింది. అలా బుల్లితెరపై యాంకర్ గా అడుగుపెట్టి దశాబ్ధాలుగా తిరుగులేని మహారాణిలా ఓ వెలుగు వెలిగిపోతోంది.

సుమ లేని సినిమా ఆడియో ఫంక్షన్ లేదు.. సుమ లేకుండా మూవీ సక్సెస్ మీట్ లేదు.. సుమ ఉండకుండా అసలు చాలా ఛానెళ్లలో ఏ షో కూడా ఉండదు. అవార్డు ఫంక్షన్స్ అయినా.. భారీ భారీ ఈవెంట్స్ అయినా హోస్టుగా సుమ ఉండాల్సిందే. ఒకే రోజు నలుగైరుదుగురు స్టార్ హీరోల సినిమా ఈవెంట్స్ చేసిన సత్తా సుమ సొంతం. అలా బుల్లితెరపై ఏళ్ల తరబడి ఏకచ్ఛత్రాధిపత్యం కొనసాగిస్తోంది. ఓవైపు స్టార్ యాంకర్ గా రాణిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ నేటి యువతరానితో టచ్ లో ఉంటోంది.

- Advertisement -

ఇక సుమ సోషల్ మీడియాలో చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఓ రోజు వంట వీడియో పోస్టు చేస్తే.. మరో రోజు ఫిట్ నెస్ పాఠాలు చెబుతుంది. ఇంకో రోజు సరదాగా ముచ్చట చెబుతూ.. మరో రోజు అలా కాలు కదిపి స్టెప్పులేస్తూ అభిమానులను ఖుష్ చేస్తూ ఉంటుంది. సుమ ప్రతి పోస్టు దేనికదే వెరైటీగా ఉంటుంది. ఇక ట్రెండింగ్ లో ఉన్న రీల్స్ చేయడం అంటే సుమకు భలే ఇష్టం. తాజాగా అలాంటి ఓ ట్రెండింగ్ రీల్ ను కాపీ చేసి నవ్వులు పూయించింది సుమ.

Anchor Suma

ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ప్రభుదేవా లేటెస్ట్ రీల్ వీడియో ఒకటి సుమ అండ్ కో రీ క్రియేట్ చేసింది. ఈ వీడియోలో వీరంతా నాన్ సింక్​లో చేశారు. ఆ వీడియోకు అన్ ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ 2.ఓ అనే క్యాప్షన్ జోడించి ఈ రీల్ వీడియోను షేర్ చేసింది సుమ. ప్రస్తుతం ఇది నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.

ఇది చూసిన నెటిజన్లు ఢీ షోలో జాయిన్ చేయండి, సుమ ఇంత బాగా చేస్తావ్ అని ఊహించలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక కొందరైతే.. ఇదేం నాన్ సింక్ డ్యాన్స్ రా బాబు అంటూ పగలబడి నవ్వేసుకుంటున్నారు. సుమ తన ఫన్నీ డ్యాన్స్ రీల్ వీడియోతో అందరినీ కాసేపు తెగ నవ్వించేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసి హాయిగా నవ్వుకోండి మరి.

 

View this post on Instagram

 

A post shared by Suma Kanakala (@kanakalasuma)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here