వేశ్యగా చేయడం హ్యాపీగా ఉందంటూ హీరోయిన్ కామెంట్స్.. ఇదేం తిక్క అంటూ నెటిజన్స్ ఫైర్

- Advertisement -

తెలుగమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు. టాలీవుడ్ లో నిర్మాతలంతా ముంబయి హీరోయిన్ల వైపే మొగ్గు చూపుతారు. తెలుగు వాళ్లకు ఛాన్సులివ్వరు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు తెలుగు హీరోయిన్లు కేవడం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ అక్కడి నుంచి హాలివుడ్ కు కూడా వెళ్తున్నారు. అన్ని భాషల్లో రాణిస్తూ తమ సత్తా చాటుతున్నారు. టాలెంట్ కు ఏవీ అడ్డంకులు కావని నిరూపిస్తున్నారు. అలా తెలుగు తెరపై మెరిసిన తెలుగమ్మాయి.. బాలీవుడ్ లోనూ సత్తా చాటి.. అక్కడి నుంచి హాలీవుడ్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ భామే తెలుగందం శోభితా ధూళిపాళ.

 

- Advertisement -

2013లో దేశం తరపున మిస్ ఎర్త్ పోటీల్లో పాల్గొన్న శోభిత అందులో విన్నర్ కాలేకపోయింది. అయినా ఈ బ్యూటీకి సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి.  2016లో రామన్ రాఘవ్ 2.0 సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో గూఢచారి సినిమాతో టాలీవుడ్​కు పరిచయమైంది. నైట్ మేనేజర్ సిరీస్​కు బెస్ట్ యాక్ట్రెస్ ఓటీటీ అవార్డును సొంతం చేసుకుంది. ఇక గూఢచారి, మేడ్ ఇన్ హెవెన్, ఘోస్ట్ స్టోరీస్, నైట్ మేనేజర్, పోన్నియన్ సెల్వన్ వంటి సినిమాలు/సిరీస్ల​లో ప్రధాన పాత్రలు చేసి తన అందం, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది.

స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేం నటుడు దేవ్ పటేల్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన మంకీ మ్యాన్ సినిమాలో నటించింది శోభిత. ఇందులో ఆమె ఒక వేశ్య పాత్రలో నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన అమెరికాలో విడుదలై అక్కడ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇండియాలో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ మూవీలో సీత అనే వేశ్య పాత్రలో నటించిన శోభిత తన పాత్ర గురించి మాట్లాడుతూ..  అలాంటి పాత్రలో నటించినందుకు గౌరవంగా అనిపించిందని చెప్పింది. ఈ సినిమాలో అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. అయితే ఈ భామ వేశ్య పాత్రలో నటించడం గౌరవంగా ఉండటం ఏంటంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఇక అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన రామన్ రాఘవ్ 2.0 కన్నా ముందే ఈ మంకీ మ్యాన్ సినిమాకు శోభిత ఆడిషన్ ఇచ్చినా ఈ సినిమా నిర్మాణానికి ఇంత సమయం పట్టింది. ఎట్టకేలకు ఇటీవల హాలీవుడ్​లో రిలీజై ఇప్పుడు ఇండియాలో విడుదలకు సిద్ధమైంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here