Oscar Awards : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నేడు ఎంతో గర్వపడుతుంది.ముఖ్యంగా మన టాలీవుడ్ అయితే ఇక నుండి డైరెక్టర్ రాజమౌళి కి జీవితాంతం రుణపడి ఉంటుంది అని చెప్పొచ్చు.ఎందుకంటే మన తెలుగు సినిమాకి ఇది మొట్టమొదటి ఆస్కార్ అవార్డు. ఇది వరకు కేవలం పలు బాలీవుడ్ సినిమాలకు మాత్రమే ఆస్కార్ అవార్డు దక్కింది.ఇప్పుడు మొట్టమొదటిసారి టాలీవుడ్ సినిమాకి కూడా ఆస్కార్ దక్కింది.’బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరిలో మన ఇండియన్ సినిమాకి Oscar Awards దక్కిన సందర్భంగా ఇప్పటి వరకు మన ఇండియాలో ఆస్కార్ అవార్డ్స్ గ్రహీతలు ఎవరు, ఏయే సినిమాలకు వచ్చాయి అనేది ఇప్పుడు మనం ఈ స్టోరీ లో చూడబోతున్నాము.
1.భాను అతైయా :

1982 వ సంవత్సరం లో గాంధీ అనే చిత్రం సంచలనం సృష్టించింది.ఈ చిత్రానికి దర్శకుడిగా రిచర్డ్ అనే అతను వ్యవహరించాడు.ఇందులో కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసినందుకు గాను భాను అతైయా కి ఆస్కార్ అవార్డు లభించింది.మొట్టమొదటి ఆస్కార్ అవార్డు గ్రహీత గా ఆమె చరిత్ర సృష్టించింది.
2.సత్యజిత్ రేయ్ :

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు ఇది.ఈయనకి ఉన్నన్ని అవార్డ్స్ ఎవ్వరికీ లేవు.36 నేషనల్ అవార్డ్స్ , గోల్డెన్ లయన్ అవార్డు, గోల్డెన్ బీర్ అవార్డు, రెండు సిల్వర్ బీర్స్ దక్కించుకున్న ఈయనకి 1992 వ సంవత్సరం లో ఆస్కార్ అవార్డు దక్కింది.ఫిలిం మేకింగ్ లో అద్భుతమైన ప్రావిణ్యం కనబర్చినందుకు గాను ఈయనకి ఈ అవార్డు దక్కింది.
3.రీసుల్ పూకుటి:

2008 వ సంవత్సరం లో విడుదలైన ‘స్లం డాగ్ మిలినియర్’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా కి సౌండ్ మిక్సింగ్ అద్భుతంగా చేసినందుకు గాను రీసుల్ పూకుటి కి ఆస్కార్ అవార్డు దక్కింది.ఆ ఏడాది ఈ సినిమాకి ఏకంగా మూడు క్యాటగిరిలలో ఆస్కార్ అవార్డు దక్కింది,అందులో ఇది కూడా ఒకటి.
4.గుల్జార్:

‘స్లం డాగ్ మిలినియర్’ లో జైహో పాటకి లిరిక్ రైటింగ్ అద్భుతంగా రాసినందుకు గాను గుల్జార్ కి ఆస్కార్ అవార్డు ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరి లో వచ్చింది.గుల్జార్ కి ఆస్కార్ కి ముందు బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ గా, బెస్ట్ లిరిక్ రైటర్ గా మరియు బెస్ట్ డైలాగ్ రైటర్ గా ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి.అలాంటి లెజెండ్ ఖాతాలో ఈ ఆస్కార్ అవార్డు కూడా చేరింది.
5.AR రెహ్మాన్:

బెస్ట్ ఒరిజినల్ స్కోర్ మరియు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ లో AR రెహ్మాన్ కి అవార్డు దక్కడం ఆరోజుల్లో ఎలాంటి సంచలన టాపిక్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే.ఆయన వల్లే ‘స్లం డాగ్ మిలినియర్’ చిత్రానికి మూడు క్యాటగిరీలలో అవార్డు దక్కింది.ఒక్క క్యాటగిరీలోనే అవార్డు దక్కడం గగనం అయిపోతున్న ఈరోజుల్లో ఇన్ని అవార్డ్స్ విభాగాలలో ఆస్కార్ అవార్డ్స్ దక్కేలా చేసి చరిత్ర సృష్టించాడు AR రెహ్మాన్.

ఇప్పుడు రీసెంట్ గా RRR సినిమాకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో కీరవాణి మరియు చంద్ర బోస్ కి అవార్డ్స్ దక్కడం మన అందరం అదృష్టం గా భావించాల్సిన సందర్భం. అలాగే బెస్ట్ షార్ట్ ఫిలిం క్యాటగిరిలో లో తమిళ సినిమా ‘ది ఎలిఫెంట్ విష్ప్ర్స్’ కి కూడా అవార్డు దక్కడం ఎంతో గర్వ కారణం.ఇదంతా చూస్తూ ఉంటే రాబొయ్యే రోజుల్లో కచ్చితంగా ఒస్కార్స్ లో మన ఇండియన్ సినిమాల డామినేషన్స్ వేరే లెవెల్ లో ఉంటాయని సంకేతాలు అందిస్తున్నట్టుగా మనం భావించవచ్చు.