Shivaji : నాగార్జున తో గొడవకి దిగిన శివాజీ..హద్దులు దాటిన మాటల యుద్ధం!

- Advertisement -

Shivaji : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి ఇప్పటి వరకు నేనే రెండవ బిగ్ బాస్ అనే పొగరుతో వ్యవహరించిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది శివాజీ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. హౌస్ లో తనకి నచ్చినట్టు వ్యవహరించడం, కోట్లాది మంది జనాలు చూస్తున్నారు అని కూడా లేకుండా ఇష్టమొచ్చినట్టు ఆడవాళ్లపై కామెంట్స్ చెయ్యడం, బిగ్ బాస్ హిస్టరీ మొత్తం లో ఇతనికే చెల్లింది.

Shaji
Shivaji

హోస్ట్ నాగార్జున ఒక్కసారి కూడా అతన్ని ప్రశ్నించకపోవడం ఆడియన్స్ కి చాలా కోపం వచ్చేలా చేసింది. ఇక ఈ వారం ఆయన శోభా శెట్టి మరియు ప్రియాంక పై వ్యక్తిగతం వాళ్ళిద్దరి వెనుక చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఏ రేంజ్ లో విరుచుకుపడుతున్నారో మనమంతా చూసాము. ఇలాంటి ఆడవాళ్లు మా ఇంట్లో ఉంటే గొంతు మీద కాళ్ళు వేసి తొక్కి చంపేస్తా అంటూ శివాజీ మాట్లాడిన మాటలు అతన్ని మానవత్వం లేని మనిషి గా నిలిపింది.

ప్రియాంక కానీ, శోభా శెట్టి కానీ ఎప్పుడూ కూడా శివాజీ ని ఇంత నీచం గా మాట్లాడడం ఆడియన్స్ ఎప్పుడూ చూడలేదు. శోభా శెట్టి ప్రవర్తన కచ్చితంగా చిరాకుగానే ఉంటుంది, అది గేమ్ పరంగా మాత్రమే కానీ, వ్యక్తిగతం గా మాత్రం ఆమె ఎప్పుడు శివాజీ పై నోరు జారలేదు. కానీ శివాజీ చేసిన కామెంట్స్ ని చూస్తుంటే ఇతని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి ఏంటో అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున ఈ వ్యాఖ్యలపై శివాజీ ని నిలదీసాడు.

- Advertisement -

నీ ఇంట్లో ఆడవాళ్లు అలా మాట్లాడితే పీక నొక్కేస్తావా అని నాగార్జున అనగా, కచ్చితంగా అదే చేస్తా బాబు గారు అని సమాధానం ఇస్తాడు. దానికి నాగార్జున ఫుల్ క్లాస్ పీకగా, శివాజీ వెంటనే మాట మారుస్తూ ఫ్లో లో వంద అంటాను బాబు గారు, నిజంగా చేసేస్తానా? అని సమాధానం ఇవ్వగా, ఇందాకే కదా శివాజీ చేసేస్తా అన్నావ్ అని అడుగుతాడు. అప్పుడు శివాజీ నోటి నుండి మాట రాదు. జరిగిన సంభాషణ మొత్తం లో శివాజీ మరియు నాగార్జున మధ్య మాటల యుద్ధం నడిచినట్టే అనిపించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here