Pallavi Prashanth : బిగ్‌బాస్‎లో రైతు బిడ్డకు అన్యాయం.. ఓటింగ్ సమయంలో పనిచేయని ఫోన్ నంబర్.. ప్రూఫ్ ఇదే

- Advertisement -


Pallavi Prashanth : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరో వారం రోజులు మాత్రమే ఉంది. డిసెంబర్ 17న బిగ్ బాస్ ఫైనల్ జరగనుంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరనే దానిపై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది. అలాగే ప్రస్తుత బజ్ ప్రకారం హౌస్ మేట్స్ అందరిలో పల్లవి ప్రశాంత్ అగ్రస్థానంలో ఉంది. సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన పేరు మారుమోగుతోంది. అనధికారిక ఓటింగ్ పరంగా కూడా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. సాధారణ ఓటింగ్‌లోనూ పల్లవి ప్రశాంత్ అగ్రస్థానంలో ఉంది.

గురు శివాజీ కంటే ఎక్కువ ఓట్లు రాబడుతున్న పల్లవి ప్రశాంత్‌కు ఓటేయడానికి ప్రేక్షకులంతా బారులు తీరుతున్నారు. అయితే ఓటింగ్ కోసం పల్లవి ప్రశాంత్ కు కేటాయించిన ఫోన్ నంబర్ గత రెండు రోజులుగా బ్లాక్ అయింది. రైతు బిడ్డకు ఓట్లు పడకూడదనే బిగ్ బాస్ ఇలాంటి కంత్రీ ప్లాన్ వేశారని ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు. ప్రశాంత్‌కు బిగ్ బాస్ 8886676905 నంబర్ కేటాయించారు. కేవలం ప్రశాంత్ నంబర్ మాత్రమే బ్లాక్ అయిందంటూ ఓ వీడియోను షేర్ చేస్తూ బిగ్ బాస్ పై ఫైర్ అవుతున్నారు.

8886676905 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీరు రైతుబిడ్డకు ఓటు వేయవచ్చు. కానీ ఇప్పుడు ఈ నంబర్‌కు కాల్ చేస్తే రింగ్ కావడం లేదు. అదే సమయంలో ఇతర కంటెస్టెంట్ల నంబర్లన్నీ వెంటనే మోగుతున్నాయి. దీంతో పల్లవి ప్రశాంత్‌ను ఓడించేందుకు బిగ్ బాస్ కుట్ర పన్నారని అభిమానులు ఈ విషయాన్ని హోస్ట్ నాగార్జున దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే పల్లవి ప్రశాంత్ ఓటింగ్‌లో నిజంగా కుట్ర ఉందా? లేక టెక్నికల్ ప్రాబ్లెమా అనేది వేచి చూడాలి. ఫోన్ నంబర్ పని చేయకపోయినా, ప్రశాంత్ 41శాతం ఓట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.

- Advertisement -

https://www.instagram.com/reel/C0k3I5_RB3e/?utm_source=ig_embed&ig_rid=8210e806-4e0f-4a22-b393-688ec15850e4

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here