సదా నటించిన సినిమాల్లోనే అది భయంకరమైన సీనట.. వద్దు వద్దన్నా వదల్లేదట పాపం

- Advertisement -

సినిమా అనేది రంగుల ప్రపంచం. దీంట్లో రాణించాలంటే కొన్నింటిని భరించాల్సిందే. చాలా కొద్ది మంది మాత్రమే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పైకి రాగలుగుతారు. ముఖ్యంగా హీరోయిన్ గా రాణించాలంటే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సిందే. ఇండస్ట్రీలో హీరోయిన్స్‎తో మిస్ బిహేవ్ చేయడం వాడుకొని వదిలేయడం కామన్ అయిపోయింది. మమ్మల్ని అలా చేశారు.. ఇలా వాడుకున్నారంటూ ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ చాలా కాలానికి బయటపెడుతుంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం సినిమాలో ఓ రొమాంటిక్ ఓ సీన్ చేయడానికి డైరెక్టర్స్ ని ముప్పు తిప్పలు పెట్టిందట. అంతేకాదు ఆ సినిమా విడుదలై కొన్నేళ్లు అవుతున్న ఆ సీన్ చూస్తే కంపరంగా అనిపిస్తూ ఉంటుందట. ఆమె మరెవరో కాదు జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సదా. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో అమ్మడు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. కాకాపోతే ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కోసం గట్టిగా ట్రై చేస్తోంది. ఇంకా అమ్మడికి సరైన ఛాన్స్ రాలేదు. ఈ క్రమంలోనే సదాకి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది.

జయం సినిమాలో రాను రానంటూనే చిన్నదో పాటతో కుర్రకారు గుండెల్లో నిలిచిపోయింది సదా. ఆ సినిమాలోని ఓ సీన్ లో హీరో నితిన్ – విలన్ గోపీచంద్ మధ్య నలిగిపోతుంది ఈ అమ్మడు. నితిన్ కలుసుకోవడానికి ఆమె గుడిలో ప్రదిక్షణలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులకు తెలియకుండా నితిన్ కలుస్తుంది. అప్పుడే ఆ విషయాన్ని కనిపెట్టిన గోపీచంద్ ముందుగానే అక్కడికి చేరుకుని వారిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంటాడు. ఆ సమయంలో గోపీచంద్ సదాను నాలికతో చెంపపై నాకుతాడు.

ఆ సీన్ టైంలోనే సదా చాలా ఇబ్బంది పడిందట. నేను చేయను అంటే చెయ్యను.. కావాలంటే నన్ను సినిమాలోనుంచి తీసేయండి అంటూ ప్రాధేయపడిందట. కానీ డైరెక్టర్ తేజ మాత్రం సదా మాటను అస్సలు వినలేదట. నువ్వు ఈ సీన్ చేస్తేనే సినిమాకు హైలెట్ అవుతుంది అంటూ బలవంతం చేశాడట. ఆఖరికి గోపీచంద్ కూడా వద్దులేండి సార్ అంటే ఆయనపై కూడా నీకు తెలియదులే అంటూ కోపపడ్డాడట. అక్కడ ఉండేవారు సర్ధి చెప్పడంతో అతి కష్టం మీదే ఆమె ఆ సీన్ కి ఒప్పుకునేందట. ఆ సీన్ అయిన తర్వాత ఏకంగా పదిసార్లకు పైగా తన ముఖం కడుక్కుని ఇంటికి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చిందట. ఇప్పటికీ టీవీలో ఆ సీన్ చూస్తే ఆమె తెగ ఫీల్ అయిపోతుందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here