షారుఖ్ ఖాన్ కి ఉన్న మరో పేరు ఏమిటో తెలిస్తే హిందువులు చేతులెత్తి మొక్కుతారు!

- Advertisement -

ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో షారుఖ్ ఖాన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. అమితాబ్ బచ్చన్ తర్వాత బాలీవుడ్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అతనే. మన చిన్నతనం లో బాలీవుడ్ అంటే షారుఖ్ ఖాన్ మాత్రమే గుర్తుకు వచ్చేవాడు. ఆరోజుల్లో ఆయన డామినేషన్ ఆ రేంజ్ లో ఉండేది. ఎన్నో కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన.

షారుఖ్ ఖాన్
షారుఖ్ ఖాన్

అయితే గత దశాబ్దం లో షారుఖ్ ఖాన్ కి గడ్డు కాలం ఎదురైంది అనే చెప్పాలి. తన తోటి స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంటే, షారుఖ్ ఖాన్ మాత్రం వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో రేస్ లో బాగా వెనుకబడ్డాడు. కానీ ఈ ఏడాది మాత్రం దెబ్బ తిన్న పులి లాగ ఆయన బాక్స్ ఆఫీస్ వేట ఏ రేంజ్ లో ఉండిందో మనమంతా చూసాము.

ఏడాది ప్రారంభం లో ‘పఠాన్’ చిత్రం తో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన షారుఖ్ ఖాన్, రీసెంట్ గా ‘జవాన్’ సినిమాతో మరో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ కి అతి చేరువలో ఉన్నాడు. ఇదంతా పక్కన పెడితే షారుఖ్ ఖాన్ గురించి ఎవరికీ తెలియని ఒక షాకింగ్ నిజం బయటపడింది. షారుఖ్ ఖాన్ ని షార్ట్ కట్ లో అందరూ SRK అని పిలుస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.

- Advertisement -

అయితే SRK కి మరో అర్థం కూడా రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు షారుఖ్ ఖాన్. ‘S’ అంటే శేఖర్ అని, ‘R’ అంటే రాధ అని , అలాగే ‘K’ అంటే కృష్ణ అని, మొత్తం మీద తన పేరు ని శేఖర్ రాధ కృష్ణ అని కూడా పిలుస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. ముస్లిం మతం లో పుట్టినప్పటికీ కూడా షారుఖ్ ఖాన్ అన్నీ మతాలను సమానంగా ఆదరిస్తాడు. రీసెంట్ గానే అయన తిరుమల దేవస్థానం ని కూడా దర్శించుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here