చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన చిత్రం ఉప్పెన. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. బేబమ్మగా కుర్రాళ్ల కలల రాణిగా వెలుగొందుతుంది. ఫస్ట్ చిత్రంతో రూ.100కోట్ల క్లబ్ చిత్రంలో భాగమైంది హీరోయిన్ కృతి శెట్టి. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత కెరీర్ కోసం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కాకపోతే అవకాశాలు భారీగా వచ్చిన.. ఈ మధ్యకాలంలో తాను నటించిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ కావడంతో తన గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. ముందస్తు జాగ్రత్తగా ఆమ్మడు కోలీవుడ్ పై కన్నేసింది. అలా కోలీవుడ్ లో అడుగుపెట్టి తన హవా కొనసాగించాలని చూస్తోంది. గత వారం రోజుల నుంచి తన డెబ్యూ హీరో వైష్ణవ్ తేజ తో తాను ప్రేమాయణం కొనసాగిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా వీరిద్దరు త్వరలో పెళ్లిపీటలు కూడా ఎక్కబోతున్నారని సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది. ఈ వార్తలు నిజమని అభిమానులు సైతం నమ్మి.. తమ ఆనందాన్ని వ్యక్త పరిచారు. వైరల్ అవుతున్న ఈ వ్యాఖ్యలపై కృతి శెట్టి సన్నిహితులు స్పందించినట్లు తెలుస్తోంది. వారు మాట్లాడుతూ.. కృతి శెట్టి పైన వస్తున్న రూమర్లలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

కొందరు కావాలనే ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ తెలియజేసింది. కృతి శెట్టికి ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేనట్లు వారు తెలిపారు. తాను ప్రస్తుతం సినిమాల మీదే ఫోకస్ చేసినట్లు చెప్పారు. ఇవన్నీ కేవలం వట్టి పుకార్లే అని కొట్టి పారేశారు. దీంతో కృతి శెట్టి అభిమానులు కాస్త నిరాశకు లోనయ్యారు. అప్పటి వరకు మెగా ఇంటికి కోడలు కాబోతుందని ఆశపడ్డారు. మరి ఇంతటితోనైనా ఈ పుకారు వార్త ఆగిపోతుందేమో చూడాలి.