హీరోయిన్ శ్రద్ధాదాస్ భాయ్ ఫ్రెండ్‎ను చూశారా.. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో !

- Advertisement -


అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లోనికి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధాదాస్. తన హాట్ హాట్ అందాలతో కుర్రకారులను దాసులను చేసేసుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రాంతానికి చెందిన శ్రద్ధాదాస్ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. అచ్చ తెలుగు అమ్మాయిలా మన జనాలకు బాగా దగ్గరైంది. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ భాషల్లో కూడా నటించింది. తన కెరీర్లో శ్రద్ధాదాస్ ఇప్పటివరకు 30కి పైగా సినిమాలలో నటించింది. కానీ మీడియం హీరోయిన్ గానే మిగిలిపోయింది. స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేకపోయింది. కారణం తాను నటించిన సినిమాలన్నీ మీడియం బడ్జెట్ సినిమాలే కావడం.. వాటి సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉండడమే కారణం.

శ్రద్ధాదాస్
శ్రద్ధాదాస్

ఆ తర్వాత చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అవి కూడా తన కెరీర్ కు కలిసిరాలేదు. దీంతో బుల్లితెర పైన పలు షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తూ ఉండేది. అవకాశాలు కరువైనా తాను మాత్రం సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా తన రకరకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ కు కనుల పసందు చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు తాను సింగిల్ గానే గ్లామర్ షో చేస్తూ ఉన్న ఫోటోలను మనం చూశాం.

కానీ తాజా ఓ వ్యక్తితో రొమాన్స్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసి జనాలకు షాక్ ఇచ్చింది. అయితే ఆయన మరెవరో కాదు నటుడు అభితేష్ ద్వివేది. వీరిద్దరూ కలిసి చాలా డీప్ రొమాంటిక్ మూడ్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. దీంతో వీటిని చూసిన నెటిజన్లు శ్రద్ధా అభిషేక్ ప్రేమలో ఉన్నారంటూ ఫిక్స్ అయిపోయారు. అంతేకాకుండా వీరికి ఆల్ ది బెస్ట్ చెబుతూ.. బోత్ ఆఫ్ యూ సూపర్ ఫెయిర్ అంటూ తెగ పొగిడేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here