Kriti Sanon గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఆదిపురుష్’ సినిమా తర్వాత బాలీవుడ్ ప్రముఖ నటి కృతి సనన్ షాహిద్ కపూర్‌తో కలిసి ‘తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా’ చిత్రంలో కనిపించబోతోంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ సందర్భంగా విలేకరుల సమావేశంలో షాహిద్, కృతి చిత్ర నిర్మాత దినేష్ విజన్‌తో కలిసి పాల్గొన్నారు.. ఈ మీడియా సమావేశంలో షాహిద్, కృతి పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా.. అయోధ్యలో జరిగే వేడుకపై కృతిని విలేకరి ఒక ప్రశ్న అడిగినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానంగా ఆమె మౌనం వహించింది.
విలేకరుల సమావేశంలో .. రిపోర్టర్ కృతి సనన్‌ను.. “అయోధ్యలో 22న అతిపెద్ద ఈవెంట్ జరగబోతోంది. రాముడు(ప్రభాస్) వస్తున్నాడు. ఈ ప్రత్యేక సందర్భంలో మీరు అయోధ్యకు వెళ్లబోతున్నారా? కానీ హోస్ట్ తన ప్రశ్నను పూర్తి చేయడానికి రిపోర్టర్‌కు అవకాశం ఇవ్వలేదు. అతను వెంటనే మీడియాతో ప్రశ్నోత్తరాల సెషన్‌ను ముగించినట్లు ప్రకటించాడు. షాహిద్ – కృతి సనన్ అభిమానులకు ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చాడు. ఈ సమయంలో కృతి ఈ చిత్రంలో తన పాత్ర వలె పూర్తిగా రోబోటిక్ రియాక్షన్స్ ఇచ్చింది, ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రాల్లో ఆదిపురుష్ ఒకటి. ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించగా, కృతి సీతగా నటించింది. అయితే ఈ సినిమాలోని వీఎఫ్‌ఎక్స్, స్టోరీ డైలాగులు జనాలకు అస్సలు నచ్చకపోవడంతో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమాలోని నటీనటులు కానీ, దర్శకుడు ఓం రౌత్ కానీ ‘ఆదిపురుష్’ గురించి మాట్లాడలేదు. ఆదిపురుష్ చిత్రం కారణంగా ఆ సినిమాకు సంబంధించిన వాళ్లు రామమందిరం ప్రారంభోత్సం సందర్భంగా బయట ఎలాంటి వ్యాఖ్యలు చేసేందుకు భయపడుతున్నట్లు తెలుస్తోంది.