Kriti Sanon : ఆవ్ తుజో మోగ్ కోర్తా (ఐ లవ్ యూ) అంటూ తెలుగు కుర్రాళ్లను మాయ చేసింది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. వన్.. నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్లో అరంగేట్రం చేసిన ఫస్ట్ సినిమాతోనే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత నాగచైతన్యతో కలిసి దోచెయ్ మూవీలో కనిపించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ భామ తిరిగి ముంబయికి వెళ్లింది.
బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ కృతి తన సత్తా చాటుతోంది. అక్షయ్ కుమార్ వంటి సీనియర్ స్టార్స్‌తో ఓవైపు.. వరుణ్ ధావన్, టైగర్ ష్రాఫ్, కార్తీక్ ఆర్యన్ వంటి యంగ్ హీరోలతో మరోవైపు జత కడుతోంది. సినిమాలు హిట్టు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఈ బ్యూటీకి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్.
ఇక కృతి సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. తరచూ తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా కృతి మెరున్ కలర్ షైనింగ్ డ్రెస్సులో సందడి చేసింది. ఈ డ్రెస్‌లో థైస్ దగ్గర కట్ కృతి గ్లామర్‌ను మరింత ఎలివేట్ చేసింది. చేతికి రింగులు పెట్టుకుని సింపుల్ లుక్‌లోనూ ఈ బ్యూటీ సూపర్ ఎలిగెంట్‌గా కనిపించింది.
ఈ ఫొటోలు కాస్త నెట్టింట పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోషూట్‌లో కృతి ఘాటు పోజులు చూసి కుర్రాళ్లు టెంప్ట్ అవుతున్నారు. నడుం అందాలు చూస్తూ మైమరిచిపోతున్నారు. ఇక థైస్ షోతో కృతి మతి పోగొడుతోందని కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ అందం చూడ్డానికే కదా మేం సోషల్ మీడియాలో ఉంది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ప్రస్తుతం కృతి సనన్ సినిమాల విషయానికి వస్తే ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస సరసన ఆదిపురుష్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీలో కృతి సనన్ సీత పాత్రలో మెరవనుంది. ఇక ప్రభాస్‌తో ఈ బ్యూటీ రిలేషన్షిప్లో ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. అయితే ఈ ఇద్దరూ ఈ రూమర్స్‌ను కొట్టిపడేసినా.. ఫ్యాన్స్ మాత్రం వీళ్ల జంట బాగుంటుందంటూ తెగ పోస్టులు చేస్తున్నారు.