JR NTR కు బాధగా అనిపిస్తే ఎక్కువగా ఏ హీరో సినిమా చూస్తాడో తెలుసా?

- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా JR NTR పేరు వినిపిస్తుంది..ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ ఫెమస్ గ్లోబల్ స్టార్ అయ్యాడు.ఈ సినిమా విడుదలై ఏడాది అవుతున్నా ఎన్టీఆర్ తర్వాత సినిమాను పట్టాలెక్కించలేదు.. దీంతో ఆయన ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు.తారక్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా ఎన్టీఆర్ పలు చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్లలో సందడి చేస్తున్నారు. ఇప్పటికే బింబిసార, అమిగోస్ మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పాల్గొన్న తారక్.. తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తోన్న దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా వెళ్లారు. ఇటీవల జరిగిన ఈ వేడుకలలో తారక్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశ్వక్ సేన్ టాలెంటెడ్ అని.. అశోకవనంలో అర్జున కళ్యాణం ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్లాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల కుదరలేదని అన్నారు తారక్..

ఈ సందర్బంగా ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు… అలాగే తన మనసు బాలేకపోతే కొన్ని సినిమాలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తానని.. అందులో ఈ నగరానికి ఏమైంది చిత్రం ఒకటి అని.. ఈ సినిమాను తన మూడ్ బాలేకపోతే కచ్చితంగా చూస్తానని అన్నారు తారక్. ఈ చిత్రంలో విశ్వక్ కామెడీ చేయకుండానే నవ్విస్తాడని.. మనసులో బాధను దాచుకుని.. ఎంటర్టైన్ చేయడం కష్టమని అన్నారు. విశ్వక్ నటన చూసి కొన్ని సార్లు ఆశ్చర్యపోతుంటానని అన్నారు.. ఆ సినిమా నాకు బాగా కనెక్ట్ అయ్యింది.. మనసులో ఎంత బాధ ఉన్నా పోగొడుతుందని ఎన్టీఆర్ చెప్పడం విశేషం..

ఎన్టీఆర్ కేవలం విశ్వక్ సేన్ కోసం రాలేదని.. తాను ఓ అభిమానినని.. ఫ్యాన్స్ అందరినీ నాలో చూసుకుని ఇక్కడికి వచ్చారని అన్నారు విశ్వక్ సేన్. ఒకసారి ఆయన తన ఇంటికి ఆహ్వానించి ఎంతో ఆత్మీయంగా భోజనం పెట్టి పంపించారు. నేను కారులో బయల్దేరుతూ దాస్ కా ధమ్కీ వేడుకకు రావాలని అడిగాను. వస్తానని అప్పుడు మాట ఇచ్చారు.. ఇప్పుడు గుర్తుపెట్టుకుని రావడం సంతోషంగా ఉందన్నారు విశ్వక్. ఈ వేడుకలో యాంకర్ సుమ ఎన్టీఆర్ ల మాటలు ఈవెంట్ కు హైలెట్ అయ్యాయి.. పంచులతో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. కొరటాల శివ తో సినిమా మరో నాలుగు రోజుల్లో సెట్స్ మీదకు వెళ్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here