Kriti Sanon : ఛీ..ఛీ.. నీ కక్కుర్తి పాడుగాను.. 10ఏళ్ల చిన్నవాడితో డేటింగా.. సిగ్గుండాలి

- Advertisement -

Kriti Sanon : బాలీవుడ్ హాట్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ కృతి సనన్ చివరిగా ‘తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా’లో కనిపించింది. ఈ రోబోటిక్ డ్రామా చిత్రంలో కృతితో పాటు షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కృతి తన వృత్తిపరమైన జీవితంతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. గతంలో కూడా కృతి తన ఎఫైర్ వార్తలతో చాలాసార్లు హెడ్‌లైన్స్‌లో కూడా నిలిచింది. చివరిసారిగా ‘బాహుబలి’ ఫేమ్ ప్రభాస్‌తో పాటు కృతి పేరు కూడా చర్చలో ఉంది. ఇప్పుడు ఆమె పేరు మరొకరితో వినిపిస్తోంది. వీరి రహస్య అనుబంధం గురించి బి-టౌన్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ఆలోచన ఒక్కటే కృతి బాయ్‌ఫ్రెండ్ ఎవరు?

రెడ్డిట్‌లో కృతి సనన్ ఓ ఫోటో షేర్ అయింది. ఈ ఫోటో బయటకు వచ్చిన వెంటనే వారి ఎఫైర్ గురించి మళ్లీ సోషల్ మీడియాలో వార్తలు రావడం ప్రారంభించాయి. ఈ చిత్రంలో కృతి సనన్ లండన్ వీధుల్లో ఒక అబ్బాయి చేయి పట్టుకుని తిరుగుతూ కనిపిస్తుంది. ఈ ఫోటోను చూడగానే ఈ అబ్బాయి మరెవరో కాదు, ఆమె బాయ్ ఫ్రెండ్ అని సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. ఈ అబ్బాయి పేరు కబీర్ బహియా. కబీర్ బ్రిటన్ నివాసి. కబీర్ కృతి కంటే దాదాపు పదేళ్లు చిన్నవాడు. ఇది మాత్రమే కాదు, కబీర్ తండ్రి ఇంగ్లాండ్‌కు చెందిన ఫేమస్ బిజినెస్ మ్యాన్.

- Advertisement -

కృతి సనన్‌తో తన ఎఫైర్ పుకార్లతో వెలుగులోకి వచ్చిన కబీర్ బహియా, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కూడా అనుబంధం ఉంది. కబీర్ మహేంద్ర సింగ్ ధోని, అతని భార్య సాక్షి ధోనితో కొన్ని సార్లు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చారు. కబీర్ సాక్షికి బంధువు అని తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు కృతి సనన్, కబీర్ బహియా వారి మధ్య ఉన్న బంధానికి సంబంధించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. దీనికి ముందు, కృతి పేరు సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్‌తో వినిపించింది. ‘ఆదిపురుష్’ సెట్స్ నుండి ప్రభాస్, కృతిల ఎఫైర్ గురించి వార్తలు వెలువడ్డాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here