Kriti Sanon : ‘ప్రభాస్ నన్ను అందుకే పెళ్లి చేసుకోవడం లేదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కృతి సనన్

- Advertisement -

Kriti Sanon : పాన్ ఇండియా రేంజ్ లో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు కృతి సనన్.ఈమె టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది, ఆ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.ఇక ఆ తర్వాత నాగ చైతన్య తో ‘దోచేయ్’ అనే సినిమా చేసింది.ఈ సినిమా కూడా పెద్ద ఫ్లాప్ అవ్వడం తో ఆమె టాలీవుడ్ ని వదిలి బాలీవుడ్ లో స్థిరపడిపోయింది.

Kriti Sanon
Kriti Sanon

అక్కడ ఇప్పుడు ఈమె టాప్ లీడింగ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతుంది. పెద్ద హీరోలందరూ ఈమెతో కలిసి పని చెయ్యడానికి ఎంతో ఇష్టపడుతారు,ఇక రీసెంట్ గా ఈమె ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ అనే చిత్రం లో నటించింది, ఇందులో ఆమె సీత గా కనిపించబోతుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్ నెలలో విడుదల కాబోతుంది.

Kriti Saon Images

ఇది ఇలా ఉండగా ఈ సినిమా షూటింగ్ సమయం లోనే కృతి సనన్ మరియు ప్రభాస్ బాగా దగ్గరయ్యారని, ప్రేమించుకుంటున్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ మీడియా లో ఒక రేంజ్ ప్రచారం జరుగుతూనే ఉంది. దీనికి కృతి సనన్ మరియు ప్రభాస్ ఇద్దరూ రియాక్ట్ అయ్యి మా మధ్య ఏమి లేదు అని చెప్పినా కూడా ప్రచారం ఆగడం లేదు.ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈమె ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నది.

- Advertisement -

ఈ ఇంటర్వ్యూ లో ఆమెని ఇదే ప్రశ్న గురించి అడగగా దానికి ఆమె సమాధానం చెప్తూ ‘ప్రభాస్ నాకు మంచి స్నేహితుడు.. అంత వరకే, దీని మీద ఇది వరకే నేను సోషల్ మీడియా లో వివరణ ఇచ్చాను. అయిన నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, ఎంతో కెరీర్ ఉంది.. ముందు కెరీర్ మీదనే ఫోకస్ పెట్టాలి, ప్రభాస్ మైండ్ సెట్ కూడా ఇంతే, ఎప్పుడు వర్క్ మీదనే ద్రుష్టి ఉంటుంది, ఈ ప్రేమ పెళ్లి గురించి టాపిక్స్ ఎప్పుడు మా మధ్య రాలేదు’ అని కృతి సనన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

Kriti Sanon Prabhas
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here