Kriti Kharbandha: ఈ బ్యూటీ టాలీవుడ్లో సినిమా చేసి చాలా ఏళ్లయింది. సుమంత్ నటించిన బోణి సినిమాతో టాలీవుడ్లో అరంగేట్రం చేసింది ఈ భామ. ఆ తర్వాత మిస్టర్ నూకయ్య. ఒంగోలు గిత్త, తీన్మార్ సినిమాల్లో నటించిన తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ బ్యూటీ తీన్మార్ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నటించడంతో తెగ ఆఫర్లు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడటంతో ఈ బ్యూటీ ఆశలు ఆవిరయ్యాయి. ఆ తర్వాత తెలుగులో అడపాదడపా అవకాశాలు వచ్చాయి.

కృతి చివరగా తెలుగులో రామ్ చరణ్‌కు అక్కగా బ్రూస్లీలో కనిపించింది. ఈ సినిమాలో హీరోకు అక్కగా నటించి కాస్త సాహసమే చేసిందని చెప్పొచ్చు. దీంతో ఈ భామకు తెలుగులో హీరోయిన్గా అవకాశాలు తగ్గాయి. దాంతో ఈ భామ బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ బీ టౌన్ ప్రేక్షకులను అలరిస్తోంది. హిందీలో కృతి.. యమ్లా పాగల్ దీవానా, వీరే కీ వెడ్డింగ్, షాదీ మే జరూర్ ఆనా, రాజ్.. రీబూట్, గెస్ట్ ఇన్ లండన్ వంటి సినిమాల్లో నటించి అలరించింది.

కృతి కర్బంద సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఈ బ్యూటీ తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ తెరకు దూరమైనా ఈ భామ సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులు దగ్గరగా ఉంటోంది. తాజాగా కృతి షేర్ చేసిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. గ్రీన్ కలర్ శారీలో కృతి చాలా ముద్దుగా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజులో ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. తన క్యూట్ క్యూట్ స్మైల్‌తో మెస్మరైజ్ చేసింది. ఈ స్టన్నింగ్ ఫొటోలు చూసి నెటిజన్లు కృతితో ప్రేమలో పడుతున్నారు.

ఈ భామ బాలీవుడ్ హీరో పుల్కిత్ సమ్రాట్‌తో కలిసి పాగల్ పంతి, వీరే కీ వెడ్డింగ్ అనే సినిమాల్లో నటించింది. అప్పుడే ఈ ఇద్దరి మధ్య స్నేహం చిగురించి అది కాస్త ప్రేమకు దారి తీసింది. ప్రస్తుతం ఈ కపుల్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. తరచూ ముంబయి వీధుల్లో కలిసి చక్కర్లు కొడుతుంటారు. డిన్నర్ డేట్‌కు వెళ్తూ ముంబయి మీడియాకు చిక్కుతుంటారు. తరచూ వెకేషన్లకు వెళ్తూ జాలీగా గడుపుతున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నట్లు సమాచారం.