గోడకు కొట్టిన బంతిలా అయింది బేబమ్మ పరిస్థితి.. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన అమ్మడుకు ప్రస్తుతం చేతిలో సినిమాల్లేక ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫస్ట్ మూవీ తోనే ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీ అంతా బేబమ్మగా ముద్దుగా పిలుచుకుని గుండెలకు హత్తుకున్నారు. ఉప్పెన తర్వాత వచ్చిన సినిమా కూడా సక్సెస్ కావడంతో ఈమె ఇండస్ట్రీని ఏలేస్తుంది అనుకున్నారు. దీంతో తనకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ గాలి తీసిన బెలూన్ మాదిరిగా చేసిన ప్రతి సినిమా ఫట్ అయ్యే సరికి అమ్మడిని పట్టించుకోవడమే మానేశారు. ఒక దానిని మించి మరో షాక్ తగిలే సరికి అమ్మడు తట్టుకోలేకపోతోంది.
వరుసగా కృతి శెట్టి నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలయ్యాయి. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన కస్టడీ.. కష్ట కష్టంగా ఓ వారం మాత్రమే థియేటర్లలో ఆడి కనిపించకుండా పోయింది. మళ్లీ కృతిశెట్టికి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం మొదట్లో గోల్డెన్ లెగ్ అన్న వారంతా అమ్మడిది ఐరన్ లెగ్ అంటూ దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. దీంతో అమ్మడి చూపు పొరుగింటి పైన పడింది. కన్నడ, మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఆయా భాషల్లో ఒక్కో సినిమా చేస్తోంది. అయితే తెలుగులో ఆఫర్లు కరువవడంతో కృతి షాకింగ్ డెసిషన్ తీసుకుందట. ఇంతకుముందు ఒక సినిమాకు కోటికి పైగా తీసుకున్న కృతి.. ఇప్పుడు రూ.70లక్షలు ఇచ్చిన ఒప్పుకునేందుకు రెడీగా ఉందట. స్టార్స్ కాకపోయినా.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే వాళ్లతోనైనా చేసేందుకు రెడీ అంటుందని నెట్టింట్లో ప్రచారం జరుగుతోంది. దీంతో కృతి శెట్టి పరిస్థితి చూసి ఇండస్ట్రీ అంతా జాలి పడుతోంది.