Dil Raju :దిల్ రాజు అంత పని చేశాడా..కోటి ఇచ్చి ఆ హీరోయిన్ తో..

- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో ఫెల్యూర్ లేని అతి కొద్ది మంది ప్రోడ్యూసర్ లలో దిల్ రాజు ఒకరు.. ఈయన నిర్మించిన సినిమాలు చాలావరకూ భారీ విజయాన్ని అందుకున్నాయి. అంతేకాదు కాసుల వర్షాన్ని కురిపించాయి. అయితే ఈయన ఓ హీరోయిన్ కోసం ఏకంగా కోటి రూపాయలు ఇచ్చి బుక్ చేశాడని వార్తలు ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి..అంత పెద్ద నిర్మాత తానే స్వయంగా ఓ హీరోయిన్ ను రికమెండ్ చెయ్యడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఆలస్యం ఎందుకు ఆ హీరోయిన్ ఎవరూ,ఎందుకు అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి దిల్ రాజు ఫిక్స్ అయ్యారో ఇప్పుడు చూద్దాం..

డిస్టర్బ్యూటర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన దిల్ రాజు.. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీని ఏలేసే స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు.అలా ఫెమస్ అవ్వాలంటే బుద్దితో కూడిన పని..అది దిల్ రాజుకు టన్నుల కొద్ది ఉందని సినీ ఇండస్ట్రీలో టాక్.డెడికేషన్ అంటూ ఉంటారు ఆయన అభిమానులు. సినిమా కథను బట్టి సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది ..ఓటీటీ లో రిలీజ్ చేస్తే బెటరా ..థియేటర్స్ లో రిలీజ్ చేస్తే బెటరా.. ఏ ఏరియాలో ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తుంది అని చెప్పే సత్తా ఉన్న ఏకైక టాలీవుడ్ ప్రొడ్యూసర్ .

- Advertisement -

అంతేకాదు తాను సినిమా కథలను నమ్మి ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఫ్లాప్ అవుతాయని ఆయనకు తెలిసి కూడా ప్రొడ్యూస్ చేశాడు. దానికి మెయిన్ రీజన్ ఆ కథ పట్ల ఆయన పెంచుకున్న ప్రేమ . కాగా రీసెంట్గా దిల్ రాజు మరో యంగ్ బ్యూటీ ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. లవ్ టు డే సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన పై ఇవానా పై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మనసు పడ్డట్టు తెలుస్తుంది. ఆమె నటనకు దిల్ రాజు ఫిదా అయ్యాడట. ఈ సినిమాను తెలుగులో ప్రొడ్యూస్ చేసింది దిల్ రాజునే..

కాగా,డైరెక్ట్ గా తెలుగు ద్వారా ఆమెను పరిచయం చేయడానికి దిల్ రాజు శత విధాలుగా ప్రయత్నిస్తున్నాడట. దిల్ రాజు వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆశీష్ రెడ్డితో రొమాంటిక్ ధిల్లర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది . ఇక్కడ ఈ సినిమాలో హీరోయిన్ గా ఇవానాను ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు మొదటి సినిమాకే కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చి మరి ఆమె కాల్ షీట్స్ బుక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. మొదటి సినిమాకే ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇచ్చి దిల్ రాజు ఆమెను బుక్ చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది..అసలు విషయం ఏంటో మరి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here