నటీనటులు :
కిరణ్ అబ్బవరం , అతుల్య రవి, పోసాని కృష్ణ మురళి , సప్తగిరి, ధనుష్ పవన్
డైరెక్టర్ : రమేష్ కడూరి
సంగీతం : సాయి కార్తీక్
బ్యానర్ : మైత్రి మూవీ మేకర్స్
Meter ఈమధ్య వచ్చిన కుర్ర హీరోలలో యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం.SR కల్యాణమండపం తో తొలి కమర్షియల్ సూపర్ హిట్ ని అందుకున్న కిరణ్ అబ్బవరం, రీసెంట్ గా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో మరో కమర్షియల్ హిట్ ని అందుకున్నాడు.ఇప్పుడు రీసెంట్ గా ‘మీటర్’ అనే సినిమా తో మన ముందుకి వచ్చాడు.పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టర్టైనెర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ , ట్రైలర్ తో పర్వాలేదు అనిపించింది,కానీ సినిమా కూడా అలాగే ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము.

కథ :
అర్జున్ కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) తన జీవితం లో ఎదురుకున్న కొన్ని పరిస్థితుల కారణంగా తన తండ్రి లాగ పోలీస్ ఆఫీసర్ అవ్వకూడదు అని బలంగా నిర్ణయించుకుంటాడు.కానీ కొన్ని పరిస్థితులు అతనిని పోలీస్ ఆఫీసర్ ని చేస్తాయి.ఎలా అయినా సస్పెండ్ అవ్వాలనే ఉద్దేశ్యం తో అతను చేసే ప్రతీ పని రివర్స్ లో అతనికి పోలీస్ ఆఫీసర్ గా మంచి పేరు తెచ్చిపెట్టేలా చేస్తాయి.అయితే ఒకానొక సమయం లో హోమ్ మినిస్టర్ కంఠం బైరెడ్డి (ధనుష్ పవన్) వల్ల తన జీవితానికి సంబంధించిన ఒక షాకింగ్ నిజం బయటపడుతుంది.ఏమిటి ఆ నిజం..?, ఆ నిజాన్ని తెలుసుకొని అర్జున్ కళ్యాణ్ తర్వాత ఏమి చేసాడు అనేదే స్టోరీ.

విశ్లేషణ:
హీరో కిరణ్ అబ్బవరం తనకంటూ ఒక మాస్ హీరో ఇమేజి రావాలని ఈ సినిమా ఒప్పుకున్నాడు అనే విషయం అర్థం అవుతుంది.అతనిని మాస్ యాంగిల్ లో చూసిన ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు.డ్యాన్స్ కూడా బాగా వేసాడు.హీరో గా అతను నూటికి నూరు శాతం తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసాడు.కానీ నూతన డైరెక్టర్ రమేష్ కడూరి మాత్రం అందుకు సహకరించలేదు.స్టోరీ లైన్ బాగుంది కానీ, రొటీన్ స్క్రీన్ ప్లే తో బోర్ కొట్టించి ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాడు.ఈమధ్య కమర్షియల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తెగ ఆడేస్తున్నాయి,ఎలా తీసిన చూసేస్తారు లే అనుకున్నాడేమో,కానీ రీసెంట్ గా సక్సెస్ సాధించిన కమర్షియల్ సినిమాలు రొటీన్ సబ్జెక్టు అయ్యినప్పటికీ ఫ్రెష్ నెస్ ఫీలింగ్ వచ్చేలా చేసాయి.అందుకే సక్సెస్ సాధించాయి.కానీ మీటర్ లో లోపించింది అదే, సినిమాలో కొత్తదనం ఉండదు, స్క్రీన్ ప్లే చాలా బోరింగ్ గా ఉంటుంది.

ఇక హీరోయిన్ ఆతుల్య రవి చూసేందుకు ఎంతో అందంగా ఉంది, కానీ డైరెక్టర్ ఆమెని స్క్రీన్ కి చాలా పరిమితం చేసాడు.కేవలం హీరో పక్క డ్యాన్స్ వెయ్యడానికే ఆమె ఉన్నట్టుగా అనిపించింది.ఇది వరకు విడుదలైన కిరణ్ అబ్బవరం సినిమాలలో హీరోయిన్స్ కి ప్రాముఖ్యత ఉండేది.మొదటి సినిమా నుండి మొన్న విడుదలైన ‘వినరో భాగ్యము విష్ణు కథ‘ సినిమా వరకు ఇదే జరుగుతూ వచ్చింది, కానీ ఈ సినిమా విషయం లో మాత్రం అది జరగలేదు.ఇక విలన్ గా చేసిన ధనుష్ పవన్ పర్వాలేదు అనిపించాడు, కిరణ్ అబ్బవరం తో ఇతని ఫేస్ ఆఫ్ సన్నివేశాలు బాగా పండాయి.
చివరి మాట :
నాలుగైదు సినిమాలను కలిపి డైరెక్టర్ రమేష్ కడూరి ఒక రొటీన్ సినిమాని మనకి అందించాడు,కనీసం ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్దాం అనుకున్నా బుక్ అయిపోతారు, సినిమా అంత బోరింగ్ గా ఉంటుంది.
రేటింగ్ : 2/5