బాలివుడ్ స్టార్ హీరోయిన్ Kiara Advani గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా రెండు మూడు సినిమాలు చేసింది.. ఇటీవలే తాను ప్రేమించిన హీరోను పెళ్లి చేసుకుంది.. అయితే పెళ్ళై నెల రోజులు కూడా పూర్తవ్వక ముందే సినిమాల్లో బిజీ అయ్యింది.బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ మల్హోత్రాను ప్రేమించి పెళ్లాడింది. పలువురు సెలబ్రిటీలు కూడా వీరికి పెళ్లికి హాజరయ్యారు.. కాగా, ఈ అమ్మడు గురించి ఒక వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. పెళ్లి తర్వాత భారీగా రెమ్యూనరేషన్ ను పెంచిందని సమాచారం..

కియారా బాలివుడ్ లో ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ మరో వైపు తెలుగులో కూడా సినిమాలు చేసింది. మహేష్ బాబుతో కలిసి భరత్ అనే నేను సినిమాలో నటించింది. ఇటు రామ్ చరణ్‌తో కూడా కలిసి నటించింది. వినయ విధేయ రామ అనే సినిమా చేసింది.. ప్రస్తుతం రామ చరణ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. శంకర్ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇక ఇదే కాంబోలో గతంలో వినయ విధేయ రామ చిత్రం వచ్చింది. ఆ సినిమా భారీ అంచనాలతో వచ్చిన కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది..ఈ సినిమాకి అన్ని భాషల్లో కలిపి ఓవర్సీస్ రైట్స్ కోసం 45 కోట్లకి పైగానే చెల్లించేందుకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రెడీగా ఉందని తెలుస్తోంది..

RC 15 కోసం కొత్తగా పెళ్లైన కియారా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ అమ్మడు ఈ సినిమాకు ఏకంగా రూ.4 కోట్లు తీసుకుంటుందని టాక్.. ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో ఓ కీలకమైన పాత్రలో నటి ఖుష్బూ కనిపించనుందని తెలుస్తోంది. ఈ పాత్ర ఈ సినిమా మొత్తంలోనే చాలా కీలకం అని సమాచారం. దీంతో ఆ పాత్ర కోసం ఖుష్బూను ఎంపిక చేశారట శంకర్. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రైట్స్ ను జీ సొంతం చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..