Jordar Sujatha : పెళ్లి చేసుకున్న జబర్దస్త్ జంట రాకేష్, సుజాత.. ఫోటోలు వైరల్..

- Advertisement -

Jordar Sujatha : జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేష్ తాజాగా ఓ ఇంటి వాడు అయ్యాడు. తాను ఎంతోకాలంగా ప్రేమించిన జోర్దార్ సుజాతతో ఏడడుగులు వేశారు.. కుటుంబ సభ్యులు ,జబర్దస్త్ కమెడియన్స్, వాళ్ళ ఫ్యామిలీతో హాజరై ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. అలాగే నూతన వధూవరులకు ఆశీర్వాదాలు కూడా అందజేస్తున్నారు. ఇకపోతే జబర్దస్త్ లోకి చిల్డ్రన్స్ తో స్కిట్స్ చేస్తూ టీం లీడర్ గా వ్యవహరించిన రాకింగ్ రాకేష్ తనదైన కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరించారు.

Jordar Sujatha
Jordar Sujatha

ఆ తర్వాత అందరిలాగే స్కిట్స్ చేస్తూ వచ్చారు. మరొకవైపు ఒక న్యూస్ ఛానల్ యాంకర్ గా పని చేసింది. ఆ తర్వాత స్టార్ మా ఛానెల్ లో ప్రసారిమవుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొంది. మంచి క్రేజ్ ను అందుకుంది.. దాంతో కామెడీ షో లో కనిపించింది.నిజానికి రాకేష్ తో ముందు నుంచే ఆమెకు పరిచయం ఉంది. అయితే ఆమె కూడా జబర్దస్త్ షోలో అడుగు పెట్టడం, రాకేష్ టీంలో స్కిట్స్ చేస్తూ రావడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని మల్లెమాల టీం చూపించింది. అయితే రీల్ జోడిగా కాస్తో కూస్తో ఫేమ్ తెచ్చుకున్న వీరు ఇప్పుడు నిజంగానే రియల్ జోడిగా మారిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచారు..

Jordar Sujatha

ఇక వీరిద్దరూ ఈరోజు ఉదయం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే వీరి పెళ్లి గురించి కేవలం అత్యంత సన్నిహితులు బంధుమిత్రులకు మాత్రమే చెప్పడం జరిగింది. అయితే వీరి పెళ్లి గురించి అభిమానులతో ఎక్కడా కూడా ఇంటి ఇవ్వకపోవడం అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు కానీ ఎట్టకేలకు ఈ ప్రేమ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడంతో పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత ఎట్టకేలకు వైవాహిక బంధం లోకి అడుగుపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక వీరి పెళ్లికి గెటప్ శ్రీను అలాగే యాంకర్ రవి, ఏపీ మంత్రి రోజా ఫ్యామిలీలతో హాజరయ్యారు.. ఈ వేడుకకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here