‘ఖుషి’ రిలీజ్ ట్రైలర్ అదిరిపోయింది.. ‘గీత గోవిందం’ రేంజ్ హిట్ రాబోతోందా..?

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ‘ఖుషి’ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాలు ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. చిన్న సినిమాల హవానే ఎక్కువగా కనిపించింది. రీసెంట్ గా విడుదలైన పవన్ కళ్యాణ్ బ్రో , ప్రభాస్ ఆదిపురుష్ చిత్రాలు కూడా భారీ స్థాయిలో నష్టాలను కలిగించాయి.

దాంతో ఖుషి సినిమా పెద్ద హిట్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాల వల్ల నష్టపోయిన డబ్బులు మొత్తం వెనక్కి వస్తుంది అనే ఆశతో ఉన్నారు బయ్యర్స్. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, టీజర్ మరియు ట్రైలర్ ఇలా ప్రతీ ఒక్కటి కూడా అభిమానులను మరియు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక కాసేపటి క్రితమే విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ మొదట రిలీజ్ చేసిన ట్రైలర్ కంటే గొప్పగా ఉంది.

ఈ ట్రైలర్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటుగా ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయ్యినట్టు అనిపించింది. టాలీవుడ్ లవ్ స్టోరీస్ లో మరో క్లాసిక్ స్టేటస్ ని దక్కించుకునే సినిమాగా ఇది నిలుస్తుందని ఈ ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతుంది. సమంత మరియు విజయ్ దేవరకొండ నుండి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ని ఈ సినిమాలో మనం ఆశించవచ్చు. రీసెంట్ గా ప్రదర్శించిన ప్రివ్యూ షో కి కూడా మంచి టాక్ వచ్చింది.

- Advertisement -

విజయ్ దేవరకొండ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో బాగా పేలిందని టాక్. ఇక సమంత కూడా తన కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది అంటున్నారు. ఒక పక్క ఫన్ , మరో పక్క ఎమోషన్ రెండు కూడా సమపాళ్లలో తెరకెక్కించిన ఈ సినిమా కచ్చితంగా చరిత్ర తిరగ రాసే రేంజ్ లో బ్లాక్ బస్టర్ కొడుతుందని అంటున్నారు.చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here