Kushi Re-release : ఖుషి రీ-రిలీజ్ కలెక్షన్స్..వరల్డ్ బాక్స్ ఆఫీస్ హిస్టరీ లో మరో రికార్డు..

- Advertisement -

Kushi Re-release : తెలుగు స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘ఖుషి’ చిత్రం డిసెంబర్ 31 న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రీ రిలీజ్ అయ్యి సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని దక్కించుకుంది.ఒక్కరోజులో ఈ సినిమాకి వచ్చినటువంటి వసూళ్లు చాలా మంది స్టార్ హీరోలకు మొదటి రోజు కూడా రావు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది.. సిటీ లో ఉన్న ప్రతీ థియేటర్ లో ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ ని అందుకుంది.. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి కానీ ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్, కలెక్షన్స్ మరే సినిమాకు రాలేదని తెలుస్తుంది..

Kushi Re-release
Kushi Re-release

నైజాం ప్రాంతం లో మొదటి రోజు దాదాపుగా కోటి 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..గతం లో ‘జల్సా‘ స్పెషల్ షోస్ ఈ ప్రాంతం లో కోటి 23 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది..ఆ తర్వాత పలు సినిమాలు రీ రిలీజ్ అయ్యినప్పటికీ ఏ సినిమాకి కూడా ఈ స్థాయి వసూళ్లు రాలేదు..మళ్ళీ పవన్ కళ్యాణే తన రికార్డుని తానే బద్దలు కొట్టాడు..భవిష్యత్తులో ఈ రికార్డు ని ఎవ్వరు టచ్ చెయ్యలేరు కూడా..ఇక సీడెడ్ లో అయితే ఈ చిత్రం చరిత్ర తిరగరాసింది.

Pawan Kalyan
Pawan Kalyan

విడుదలైన ప్రతీ చోట కాసుల కనకవర్షం కురిపించిన ఈ చిత్రానికి మొదటి రోజు అక్కడ 60 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని సమాచారం..ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం లో 40 లక్షలు , ఈస్ట్ గోదావరి జిల్లాలో 20 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 15 లక్షలు, గుంటూరు సిటీ 45 లక్షలు ఇలా అన్నీ చోట్ల మంచి కలెక్షన్స్ ను రాబట్టింది..అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమా నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజిగా ఉన్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here