గోల్డెన్ సారి లో మెరిసిపోతున్న కేజిఎఫ్ బ్యూటీ…

- Advertisement -

శ్రీనిధి శెట్టి.. కేజిఎఫ్ మూవీ పుణ్యమా అని ఈ బ్యూటీ గురించి పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ 2015లో మిస్ కర్ణాటక మరియు మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిల్స్ ను గెలుచుకుంది. ఆ తర్వాత 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్ని కూడా తన ఖాతాలో వేసుకుంది.

శ్రీనిధి శెట్టి
శ్రీనిధి శెట్టి

కేజిఎఫ్ మూవీతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి చిత్రంతోనే అందరిని ఫిదా చేసింది.ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎస్ హీరోగా వచ్చిన ఈ మూవీ రెండు పార్టీలుగా విడుదలై బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. మొదటి పార్ట్ తో పోలిస్తే రెండవ పార్ట్ లో శ్రీనిధి పాత్ర కు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది.మొదటి చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ హిట్ సంపాదించిన పాపం ఈ బ్యూటీకి ఆఫర్లు మాత్రం పెద్దగా రాలేదు.

విక్రమ్ హీరోగా తెరకెక్కిన కోబ్రా చిత్రంలో కేజిఎఫ్ తర్వాత శ్రీనిధికి ఆఫర్ వచ్చింది. అయితే ఈ మూవీ అనుకున్న రేంజ్ సక్సెస్ సంపాదించలేదు.ప్రస్తుతం శ్రీనిధి పరిస్థితి ఎలా ఉందంటే నచ్చిన ఆఫర్లు రావడం లేదు.. వచ్చిన వాటి కథ నచ్చడం లేదు. దీంతో పాపం ఈ అమ్మడు చేతిలో ఎటువంటి సినిమాలు లేక ఖాళీగా ఉంది.

- Advertisement -

ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం మాత్రం తాజాగా శ్రీనిధి శెట్టి ఫోటోషూట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. గోల్డ్ కలర్ సెల్ఫ్ ఎంబ్రాయిడరీ సీక్వెల్ సారీ తో అప్సరసల మెరిసిపోతోంది. మత్తెక్కించే కళ్ళతో , అందమైన చిరునవ్వుతో ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ భామను చూసి సోషల్ మీడియాలో అందరూ ఫిదా అవుతున్నారు. ఇంత అందంగా ఎలా ఉంది రా బాబు…ఊపిరాడడం లేదు అని కామెంట్స్ పెట్టి వైరల్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here