Srinidhi Shetty : రహస్యంగా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చిన హీరోయిన్..

- Advertisement -

srinidhi shetty ఒకే ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన హీరో హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అందరికీ గుర్తుకు వచ్చే పేర్లు రెండే రెండు..అవి ఒకటి యష్ అయితే మరొకటి శ్రీనిధి శెట్టి. అవును కే.జి.ఎఫ్ 1 సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన యష్,శ్రీనిధి శెట్టి ఇద్దరు ఎంతో మంచి గుర్తింపును సంపాదించారు. ఆ తర్వాత వచ్చిన కే.జీ.ఎఫ్ 2 సినిమా కూడా వీరికి స్టార్డమ్ ని తెచ్చి పెట్టడంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ కి వెళ్ళిపోయారు.అయితే ఇంత రేంజ్ అందుకున్నప్పటికీ శ్రీనిధి శెట్టికి మరో అవకాశం రావడం లేదు. ఆమెకు ఇతర అవకాశాలు రాకపోవడం బాధాకరం.

Srinidhi Shetty
Srinidhi Shetty

తాజాగా శ్రీనిధి శెట్టి సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది అంటూ నెట్టింట్లో ఒక ఫోటో చక్కర్లు కొడుతుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. శ్రీనిధి తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు నుదుటిన బొట్టు పెట్టుకొని కనిపిస్తోంది. అయితే ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో ఈ ఫోటో చూసిన చాలామంది నెటిజన్స్ ఏంటి శ్రీనిధి శెట్టి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది గా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే దీని గురించి తెలిసిన కొంతమంది కర్ణాటక వాళ్ళు అలాంటిదేమీ లేదు కర్ణాటకలోని ఒక కులానికి చెందిన కొంతమంది యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు కూడా ఇలా పెళ్లి కాకుండానే నుదుటన బొట్టు పెట్టుకుంటారుట. ఇది ఆచారంలో ఒక భాగమే అని టాక్.అందుకే శ్రీనిధి శెట్టి కూడా అలా నుదుటన బొట్టు పెట్టుకుందని సమాచారం.అంతేగాని ఆమె ఎలాంటి పెళ్లి చేసుకోలేదు అంటూ క్లారిటీ ఇస్తున్నారు.మరి ఇది నిజమేనా కాదా అని అందరూ అయోమయంలో పడిపోయారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here