మహానటి కీర్తి సురేష్ రాజకీయాల్లోకి వస్తుందా..? అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కీర్తి తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తెలుగులో భోళా శంకర్ సినిమాలో చిరుకు చెల్లెలిగా నటిస్తోంది. ఇంకోపక్క తమిళ్ లో మామన్నన్ సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఇక మామన్నన్ సినిమా ప్రమోషన్స్ లో కీర్తి.. రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది.
రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇలా ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కీర్తి సురేష్ కి రాజకీయాల గురించి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. కీర్తిసురేష్ రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి ఉందా.? అని ప్రశ్నించగా.. దాని గురించి ఆలోచించాలి అని చెప్పింది. దీంతో కీర్తికి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఉందని, త్వరలోనే ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందని తమిళ్ మీడియా కోడై కూస్తోంది.
అయితే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఎంటర్ అవుతుందా..? లేక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది.ఇక కీర్తి ఫ్యాన్స్ మాత్రం .. రాజకీయాలు వద్దు .. సినిమాలే చేయండి అంటూ చెప్పుకురావడం గమనార్హం.ఇకపోతే ఈ మధ్యనే కీర్తి పెళ్లి గురించి కూడా రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపించాయి. కానీ, అందులో నిజం లేదని కీర్తి ఫాదర్ చెప్పడంతో వాటికి చెక్ పడింది.ఇక ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతుందని ప్రచారం జరుగుతోంది.తమిళనాడు ఎన్నోకల్లో ఆమె సందడి చేయనుందని వస్తున్న వార్తలను కీర్తి ఖండిస్తుందా..?లేదా ..? అనేదిచూడాలి.