జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ #OG..అప్పుడే 50 శాతం షూటింగ్ పూర్తి!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో #OG అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలలో అమిత శ్రద్ద చూపిస్తున్న చిత్రం ఇదే. అంతే కాదు , ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో ఈ చిత్రం పై ఉన్న అంచనాలు మామూలు రేంజ్ కాదు.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ జల్సా సినిమాకి ఏ రేంజ్ అంచనాలు ఉండేవో, ఆ రేంజ్ అంచనాలు ఈ సినిమా మీద కూడా ఉన్నాయి. దానికి తోడు ఈ చిత్రం లో పని చేసే ప్రతీ ఒక్కరు సినిమా స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని, ఈ సినిమా విడుదలైన తర్వాత బౌండరీస్ మొత్తం బ్లాస్ట్ అవుతాయని, పాన్ ఇండియా లెవెల్ లో సునామి సృష్టించడం ఖాయం అని అంటుండడంతో అంచనాలు పదింతలు అయ్యాయి.

ఇక పోతే మొన్ననే ప్రారంభం అయ్యినట్టు అనిపిస్తున్న ఈ సినిమా అప్పుడే 50 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకుందట. కాసేపటి క్రితమే మూవీ టీం అధికారిక ప్రకటన చేసింది. డ్రామా , యాక్షన్ సన్నివేశాలతో మూడవ షెడ్యూల్ పూర్తి అయ్యిందని. ఇక్కడితో సినిమాకి సంబంధించి 50 శాతం షూటింగ్ అయిపోయిందని, రాబొయ్యే రోజుల్లో సెన్సేషనల్ అప్డేట్ కోసం ఎదురు చూడండి అంటూ కాసేపటి క్రితమే ట్విట్టర్ లో ట్వీట్ వేసింది డీవీవీ దానయ్య సంస్థ.

- Advertisement -

పవన్ కళ్యాణ్ ఇక కేవలం 30 రోజుల కాల్ షీట్స్ ఇచ్చేస్తే సినిమా షూటింగ్ మొత్తం అయిపోతుందని. డిసెంబర్ నెలలో ఈ సినిమాని గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా, విలన్ గా ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఆయన కూడా రీసెంట్ గానే షూటింగ్ లో పాల్గొన్నాడు. కొత్త షెడ్యూల్ కి సంబంధించిన వివరాలు అతి త్వరలోనే తెలియచెయ్యనుండి మూవీ టీం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here