Keerthy Suresh : బీచ్ లో పూర్తిగా మగరాయుడిలా మారిపోయిన మహానటి.. నీలో ఈ యాంగిల్ ఎప్పుడూ చూడలేదు కీర్తి
Keerthy Suresh.. మహానటి సినిమాతో తన పేరు సినిమా ఇండస్ట్రీలో మార్మోగిపోయేలా చేసుకుంది. ప్రస్తుతం ఈ పేరంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. మహానటిగా ముద్ర వేయించుకున్న కీర్తి సురేష్ కెరీర్ ప్రస్తుతం జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు వరుస సినిమాల్లో అమ్మడు నటిస్తోంది. తాజాగా అమ్మడు నటించిన తెలుగు చిత్రం భోళా శంకర్. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. బాలీవుడ్ సినిమాలకు వరుసగా సైన్ చేస్తుంది కీర్తి సురేష్..

Keerthy Suresh
Keerthy Suresh

తాజాగా చెన్నైలోని ఓ బీచ్ లో మహీంద్రా థార్ నడుపుతున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. సినిమాల్లో హీరోలు చేజింగ్ సీన్లలో నడిపినట్లు ఇసుకలో దుమ్ము లేపింది. బీచ్ ఇసుకలో ఓ రేంజ్ లో స్టైలిష్ గా జీప్ డ్రైవ్ చేసింది కీర్తి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కీర్తిని చూసిన అభిమానులు ఆమెను తెగ కీర్తిస్తున్నారు.

Keerthy Suresh photos

మరికొందరు మాత్రం ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కుందనపు బొమ్మలా ఉన్నావు .. బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లాక మగ రాయుడిలా మారిపోయావేంటి అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ జీప్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరోయిన్స్ ఈ రేంజ్ లో డ్రైవింగ్ చాలా రేర్ అందుకే ఈ వీడియో నెటిజన్లకు తెగ నచ్చేసింది.

Tags: