Dasara రీసెంట్ గా విడుదలైన సినిమాలలో న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.విడుదలకు ముందు నుండే మంచి ప్రమోషనల్ కంటెంట్ మరియు సాంగ్స్ తో అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు రేపిన ఈ చిత్రం, విడుదల తర్వాత ఆ అంచనాలకు మించి వసూళ్లను రాబట్టి మీడియం రేంజ్ హీరోలలో ఆల్ టైం టాప్ 2 మూవీ గా నిల్చింది.

మొదటి స్థానం లో విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ‘గీతా గోవిందం’ అనే సినిమా ఉంది.ఈ చిత్రం సుమారుగా 72 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.దసరా ఆ రికార్డు ని బద్దలు కొడుతుందని అందరూ ఆశించారు కానీ అది జరగలేదు.ఇక ఇదంతా కాసేపు పక్కన పెడితే ఈ సినిమాలో నాని తర్వాత నటన పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది కీర్తి సురేష్.

ముఖ్యంగా తెలంగాణ భాషలో మాట్లాడేందుకు కీర్తి సురేష్ చాలా కష్టపడింది.మొదట్లో ఆ చిత్ర డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈమె సరిగా డైలాగ్స్ చెప్పలేకపోతుంది అన్నా, వేరే హీరోయిన్ ని పెట్టుకుందాం అని నాని తో అన్నాడట.ఈ విషయాన్నీ స్వయంగా నాని కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు.ఆ తర్వాత కీర్తి సురేష్ తెలంగాణ యాస పర్ఫెక్ట్ గా వచ్చేందుకు ఒక ట్రైనర్ ని పక్కన పెట్టుకొని డైలాగ్స్ చెప్పిందట.

ఆమె పర్ఫెక్షన్ చూసి శ్రీకాంత్ ‘ఈ సినిమాకి ఈమె తప్ప ఎవ్వరూ న్యాయం చెయ్యలేరు అన్నా’ అని నాని తో అన్నాడట.రీసెంట్ గా కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్తున్న సమయం లో మేకర్స్ తీసిన ఒక వీడియో ని సోషల్ మీడియా లో విడుదల చేసారు.ఈ వీడియో కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అచ్చం తెలంగాణ పిల్లలాగా పరకాయ ప్రవేశం చేసి ఎంత అద్భుతంగా డైలాగ్స్ చెప్పిందో అంటూ నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.