Katrina Kaif : అక్క‌డ‌ దుపట్టాతో క‌వ‌ర్ చేసిన‌ క‌త్రినా.. వామ్మో అది నిజ‌మేనా..!

- Advertisement -

Katrina Kaif : సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఇటీవల శుభవార్త పంచుకుంటున్నారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ-నటి అనుష్క శర్మ ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ అందమైన జంట రణవీర్ సింగ్ – దీపికా పదుకొనే త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని అభిమానులకు శుభవార్త అందించారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తల్లి కాబోతోందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వరలో విక్కీ కౌశల్ ఇంటికి ఓ స్పెషల్ గెస్ట్ వస్తాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. టాలీవుడ్ లో వెంకటేష్ నటించిన మల్లీశ్వరి సినిమాలో విక్టరీ నటించింది.

Katrina Kaif

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, ప్రముఖులు తరలివచ్చారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో భారతదేశానికి సంబంధించిన సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు సందడి చేశారు. జామ్‌నగర్‌లో జరిగిన వేడుకకు బాలీవుడ్ జంట కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ వెళ్లారు. ఆ సమయంలో, ఆమె క‌డుపుతో వుండ‌టంతో.. ప్రెగ్నీసీ స‌మ‌యంలో వున్న పొట్ట మాత్రం కాస్త ఎత్తుగా క‌నిపించింది. దీంతో దిష్టి త‌గులుతుందో లేక ఏమ‌ని అనుకుందో తెలియ‌దు కానీ.. క‌త్రినా.. క‌డుపు క‌నిపించ‌కుండా.. త‌న దుపట్టాతో పదేపదే దాచడం కెమెరాకు చిక్కింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కత్రినా-విక్కీ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

విక్కీ కౌశల్ – కత్రినా కొంతకాలం ప్రేమించుకున్నారు మరియు కలిసి జీవించారు. పెద్దలను ఒప్పించి 2021 డిసెంబర్‌లో హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు.ఈ జంటకు పెళ్లయి మూడేళ్లు అయింది. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో ఫోటో షూట్ సందర్భంగా కత్రినా కైఫ్ లేత గులాబీ రంగు దుస్తులలో చాలా అందంగా ఉంది. అయితే కత్రినా ప్రెగ్నన్సీపై అధికారిక ప్రకటన లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు అభిమానులు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే తల్లి కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here