Vijay Sethupathi : విజయ్ సేతుపతి అంటే ఎవరో తెలియదు.. అందుకే గూగుల్లో సెర్చ్ చేశా.. కత్రినా సంచలన వ్యాఖ్యలు

- Advertisement -


Vijay Sethupathi : విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన సినిమా మేరీ క్రిస్మస్. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమాను డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించారు. ఇక ఈ మేరి క్రిస్మస్ సినిమా చూసిన వారంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక మొత్తానికి ఈ సినిమాతో విజయ్ సేతుపతి సూపర్ హిట్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కత్రినా కైఫ్ షాపింగ్ కామెంట్లు చేసింది.

కత్రినా మాట్లాడుతూ..‘నేను 96వ సినిమా చూశాను. అందులో త్రిష, విజయ్ సేతుపతి అద్భుతంగా నటించారు. ఆ ఇద్దరు అంటే చాలా ఇష్టం. దర్శకుడు శ్రీరామ్ కథ చెప్పినప్పుడు నేను నటించబోయే సినిమాలో విజయ్ సేతుపతి హీరో అని నాతో చెప్పాడు. అతడు ఎవరనేది నాకు తెలియక.. అతనెవరో తెలుసుకుందామని గూగుల్లో సెర్చ్ చేశాను.

అందులో మొదట నేను చూసినప్పుడు విజయ్.. గడ్డం, తెల్ల జుట్టుతో కనిపించాడు. నాకు అతని స్టైల్ నచ్చింది. అప్పుడు తెల్ల గడ్డం ఏ సినిమా కోసం అని విజయ్ ని అడిగాను. దానికి ఆయన నా ఒరిజినల్ లుక్ అని ఆన్సర్ ఇచ్చారు ” అంటూ చెప్పుకొచ్చింది కత్రినా. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here