ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో డాన్స్ కొరియోగ్రాఫర్ అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది శివ శంకర్ మాస్టర్ మాత్రమే.. ఆయన తర్వాత ప్లేస్ లో ఉన్నది రాకేష్ మాస్టర్ మాత్రమే. ఇద్దరు స్టార్ కొరియోగ్రాఫర్లు మరణించడం ఇండస్ట్రీకి తీరని శోకం. అయితే రాకేష్ మాస్టర్ తాజాగా మరణించడంతో అనేక విషయాలు సోషల్ మీడియాలో బయటకు వస్తున్నాయి. అయితే ఆయన రక్త విరేచనాల వల్ల చనిపోయారని, ఆ విరేచనాలు రావడానికి ప్రధాన కారణం మందు తాగడమే అని కొన్ని విషయాలు సోషల్ మీడియాలో తీవ్రంగా చక్కర్లు కొడుతున్నాయి.

కాగా రాకేష్ మాస్టర్ మరణంపై షాకింగ్ కామెంట్స్ చేశారు వివాదాస్పద నటి కరాటే కళ్యాణి. రాకేష్ మాస్టర్‌ని నివాళులు తెలియజేసిన అనంతరం కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. ‘రాకేష్ మాస్టర్ చేజేతులా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు. వ్యసనాలకు బానిసైపోయారు. అన్ని విధాలుగా అలవాట్లను కంట్రోల్ చేసుకుని ఉంటే బాగుండేది. ఆయన అందరికీ మంచి చేసే మనిషి. మంచి మనసు. ఆపదలో ఉన్న వాళ్లకి తనకి తోచిన సాయం చేసేవారు. ఓ పక్క ఆయన లైఫ్ పోయింది.. ఇంకో పక్క కెరియర్ పోయింది. ఇలాంటి వెధవలంతా అనే మాటల్ని విని మానసికంగా డిప్రెషన్‌లోకి వెళ్లారు. అయినా సరే పోరటం చేస్తూనే ఉన్నారు. ఈ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి మందుని అలవాటు చేసుకున్నారు.. ఇలా తాగితాగి చివరికి చనిపోయారు.

నేనంటే రాకేష్ మాస్టర్‌కి చాలా అభిమానం. చనిపోయే ముందు కూడా నా గురించి మాట్లాడారట. నన్ను కూతురు కూతురు అనేవారు. ఆయన బాధల్ని నాతో పంచుకునేవారు. అయితే నాకు తాగితే నచ్చదు కాబట్టి.. పెద్దగా మాట్లాడేవారు కాదు. కొన్ని కొన్ని పనులకు నేను పూసుకోను. నా లిమిట్‌లో నేను ఉండేదాన్ని. ఏ ఇష్యూ వచ్చినా కూడా నాకు సపోర్ట్ చేశారు.
నా ఇంటికి వచ్చేవారు. ఆయన ఆశ్రమంలోనే ఉండి ఉంటే చనిపోయేవారు కాదేమో.. ఆ షో చేయడానికి విజయనగరం వెళ్లడం.. అక్కడ బాగా తాగేయడం వల్లే ఇలా అయ్యింది. ఆయన చనిపోయారని తెలిసిన తరువాత మనసు చాలా బాధ అనిపించింది. రాకేష్ మాస్టర్‌లా వ్యసనాలకు బానిస కావొద్దని చెప్తున్నా.. ఇదే నేను ఇచ్చే సందేశం’ అంటూ చెప్పుకొచ్చింది కరాటే కళ్యాణి.