మా సభ్యురాలు, సినీనటి కరాటే కళ్యాణికి మా అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజు నోటీసులు. ఇటీవల ఎన్టీఆర్ పై కరాటే కళ్యాణి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. క్రమశిక్షణ ఉల్లంఘన కింద నోటిసులు జారి చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని మంచు విష్ణు ఆదేశించారు. ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ పై కరాటే కళ్యాణి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కృష్ణుడి రూపంలో తారకరామారావు విగ్రహాన్ని పెట్టడాన్ని ఆమె తప్పుబట్టింది. ఖమ్మంలో శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణను నిలిపివేయాలని అఖిల భారత యాదవ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలుగా ఆమె పేర్కొంది.

ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో ఉండడం పట్ల టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి (Karate Kalyani) అలాగే యాదవ సంఘం అధ్యక్షులు తీవ్ర వ్యతిరేకత సృష్టిస్తున్నారు. ఈ మేరకు మీడియా ఛానల్ డిబేట్లో పాల్గొని ఆమె నానా రచ్చ కూడా చేశారు.. యాదవులు గొప్పగా కొలుచుకునే శ్రీకృష్ణుడికి రూపం లేదా? హిందువులంతా అత్యంత పవిత్రంగా భావించే కృష్ణుడిని మానవ రూపంలో కొలవాలా? అంటూ ప్రశ్నిస్తూ.. లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నట్లుగా కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే విశ్వహిందూ పరిషత్ , ఇస్కాన్ తదితర సంస్థలు కరాటే కళ్యాణికి మద్దతుగా నిలిచాయి.

ఇకపోతే ఈ విషయంపై ఆమె హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది. తాజాగా ఈ వివాదం పై విచారించిన హైకోర్టు స్టే విధించిందని కళ్యాణి తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఇప్పుడే హైకోర్టు నుంచి తీర్పు వచ్చింది.. మే 28న ఖమ్మంలో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టకూడదని కోర్టులో జడ్జిగారు మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు.. జై శ్రీ కృష్ణ.. నువ్వు ఉన్నావు స్వామి.. అంటూ సదరు పోస్టులో ఆమె తెలిసింది. ఇకపోతే మే 28న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు బ్రేక్ పడినట్లు స్పష్టం అవుతుంది. దీంతో కరాటే కల్యాణి అభిమానులు రెచ్చిపోతున్నారు. ఏరా విష్ణు మాఅక్కు ఇచ్చినట్లు కోర్టుకు కూడా నోటీసులు ఇస్తావా అని అంటున్నారు.